Congress-bjp: అది మోదీ అప్పటికప్పుడు చేసిన ఆలోచన : జైరాం రమేశ్ ఆరోపణలు

Congress-bjp: అది మోదీ అప్పటికప్పుడు చేసిన ఆలోచన : జైరాం రమేశ్ ఆరోపణలు

Play all audios:


Jairam Ramesh: ప్రశ్నలను తప్పించుకోవడానికే ఆపరేషన్‌ సిందూర్‌పై అఖిలపక్షం బృందాలను ఏర్పాటుచేసి, విదేశాలకు పంపుతున్నారని కాంగ్రెస్ విమర్శలు చేసింది.  ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రజల దృష్టి


మరల్చడానికే అఖిలపక్ష ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) విమర్శించారు. జవాబు చెప్పాల్సిన ప్రశ్నలను దాటవేసేందుకే అప్పటికప్పుడు ఈ ఆలోచన


చేశారని వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్‌ ఎంచుకున్న బలమైన విధానాన్ని ప్రపంచ దేశాలకు


వివరించేందుకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడుకున్న ఏడు బృందాలను కేంద్రం విదేశాలకు పంపుతోంది. తమ అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వాధినేతలతోపాటు


పార్లమెంటేరియన్లు, మేధావులు, మీడియా సభ్యులను కలుస్తారు. ‘‘1950 నుంచి ఐరాసలో భారత వాణి వినిపించేందుకు ప్రతి ఏడాది అక్టోబర్‌-నవంబర్ సమయంలో అఖిలపక్ష నేతలతో కూడిన బృందాన్ని పంపేవాళ్లం. కానీ 2014


నుంచి ఆ సంప్రదాయాన్ని నిలిపివేశారు. అయితే ప్రస్తుతం మోదీ ఇమేజ్‌ ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినడంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. జవాబు చెప్పాల్సిన ప్రశ్నలను తప్పించుకోవడానికే అప్పటికప్పుడు ఈ


అఖిలపక్షం ఆలోచన చేసి ఎంపీలను విదేశాలకు పంపిస్తున్నారు’’ అని జైరాం రమేశ్ ఆరోపణలు చేశారు. * గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద ‘ఆయుధాలు’ మోహరించలేదు - భారత సైన్యం క్లారిటీ సీమాంతర ఉగ్రవాదానికి


పాకిస్థాన్‌ అందిస్తున్న ప్రోత్సాహాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడానికి ఏర్పాటుచేసిన అఖిలపక్ష బృందాల్లోని పేర్లపై రాజకీయ రగడ రాజుకుంది. పేర్ల ఎంపికను పార్టీలకే వదిలేయాల్సిందని పార్టీలు


అంటుండగా.. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని, ఏ పార్టీకీ సభ్యుల ఎంపికకు అవకాశం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టంచేశారు. రిజిజు వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని జైరాం రమేశ్‌


మండిపడ్డారు. కాంగ్రెస్‌ సిఫార్సు చేసిన ఆనంద్‌ శర్మ, గౌరవ్‌ గొగొయ్, సయ్యద్‌ నసీర్‌ హుసేన్, అమరీందర్‌ సింగ్‌లలో ఆనంద్‌ శర్మకే ఈ బృందాల్లో చోటు దక్కింది. ఆ పార్టీ నేతలు శశి థరూర్, మనీశ్‌


తివారీ, అమర్‌ సింగ్, సల్మాన్‌ ఖుర్షీద్‌లను సిఫార్సు చేయకున్నా అఖిలపక్ష బృందంలో ప్రభుత్వం చేర్చింది. ఈ అంశం పైనే కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.