Siddaramaiah: ఎస్‌బీఐ బ్యాంకులో కన్నడ వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య

Siddaramaiah: ఎస్‌బీఐ బ్యాంకులో కన్నడ వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య

Play all audios:


బ్యాంకు ఉద్యోగులు కస్టమర్లను గౌరవిస్తూ స్థానిక భాషలో మాట్లాడే ప్రయత్నం చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో


కన్నడ భాషపై జరిగిన వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. బ్యాంకు మేనేజర్‌ పౌరులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు సరైనది కాదని విమర్శించారు. స్థానిక భాషను


బ్యాంకు ఉద్యోగులందరూ గౌరవించాలని.. కస్టమర్లను గౌరవిస్తూ స్థానిక భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయాలని సూచించారు. సూర్యనగరలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించిన ఎస్‌బీఐ మేనేజర్‌ వీడియో సామాజిక


మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఎస్‌బీఐ ఆ మేనేజర్‌ను బదిలీ చేసిందని.. ఇంతటితో ఈ సమస్య సద్దుమణిగినట్లుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని


అధికారులకు సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇటువంటి


వ్యాఖ్యల వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.  * నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ అసలేమయ్యిందంటే..? కన్నడలో మాట్లాడాలని అడిగినందుకు


బెంగళూరులోని సూర్యనగరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజర్‌ కస్టమర్‌తో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బ్యాంక్‌ మేనేజర్‌ను కన్నడలో మాట్లాడాలని


కస్టమర్‌ అడగగా.. కన్నడలోనే తప్పనిసరిగా మాట్లాడాలన్న నియమం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ..ఆమె కస్టమర్‌తో వాగ్వాదానికి దిగారు. ఎన్నటికీ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటావో చేసుకోమని ఆమె


నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగులు అన్ని ప్రాంతాల్లో కస్టమర్లతో ఇదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని


పేర్కొన్నారు. దీంతో ఎస్‌బీఐ ఆమెను బదిలీ చేసింది. బ్యాంకు మేనేజర్‌ వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భాషా సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. కన్నడ భాషపై బ్యాంకు మేనేజర్‌ తీరును వ్యతిరేకిస్తూ..


బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు కర్ణాటక రక్షణ వేదికే (KRV) సంఘం ప్రకటించింది. ఎస్‌బీఐ ఉద్యోగులు కస్టమర్లను పదే పదే అగౌరవపరుస్తున్నారని.. స్థానిక భాషలో ప్రాథమిక సేవలను


అందించడంలో ఎస్‌బీఐ విఫలమయ్యిందని ఆరోపించింది.