Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

Play all audios:


శ్రీనగర్‌: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల (Operation Sindoor) నేపథ్యంలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(SKUAST)లో విద్యార్థులు ఆందోళనకు


గురవుతున్నారు. ఇందులో 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. వీరిలో పలువురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మోతతో ఆందోళన చెందుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.


తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఏపీ, తెలంగాణ విద్యార్థులు లేఖ రాశారు. దీంతో కేంద్ర మంత్రి తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్, వర్శిటీ


డీన్‌తో మాట్లాడారు. సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరారు. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన మొత్తం 23 మంది విద్యార్థులను బస్సుల్లో శ్రీనగర్‌ నుంచి దిల్లీకి పంపించారు. అక్కడి నుంచి


స్వస్థలాలకు చేరుకోనున్నారు.