
Amitabh bachchan: ‘ఆపరేషన్ సిందూర్’పై అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ పోస్టు
Play all audios:

పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి ఘటన అందరినీ
కలచివేసింది. ఆ హృదయవిదారక ఘటనపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కళ్ల ముందే భర్తను పోగొట్టుకున్న నవ వధువు శోకాన్ని ఉద్దేశిస్తూ తన తండ్రి
రాసిన పద్యంలోని ఓ లైన్‌ని ప్రస్తావించారు. ‘‘భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది. భర్తను చంపొద్దంటూ భార్య ఏడుస్తూ ఎంతగా వేడుకున్నా ఆ ఉన్మాది వినలేదు. ఆమె నుదుట
సిందూరం లేకుండా చేశాడు. కళ్ల ముందే భర్త చనిపోవడాన్ని తట్టుకోలేని ఆమె ‘నన్ను కూడా చంపేయ్’ అంటూ మోకరిల్లింది. అప్పుడు ఆ రాక్షసుడు.. ‘నిన్ను చంపను. వెళ్లి ... చెప్పుకో’’ అంటూ పొగరు చూపించాడు’’
* ఆపరేషన్ సిందూర్ టైటిల్ ప్రకటనపై దర్శకుడి క్షమాపణలు ‘‘కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తే.. ‘‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా సిందూరం ఎక్కడని ప్రపంచం అడుగుతుంది’’ అని నాన్న రాసిన పద్యంలోని
లైన్ గుర్తొచ్చింది. ‘అందుకే నేను సిందూరం ఇస్తున్నా.. ఆపరేషన్ సిందూర్’ అని తాజాగా ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను ప్రస్తావించారు. జైహింద్. భారత సైన్యమా.. నువ్వు ఎప్పటికీ వెనకడుగు వేయవు.
నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు’’ అని పేర్కొన్నారు. అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాలతోపాటు సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే, పహల్గాం దాడి
నుంచి ఆయన ‘ఎక్స్’లో కేవలం పోస్టు సంఖ్యనే (అమితాబ్ తన ప్రతి పోస్టుకు సీరియల్ నెంబరు ఉంటుంది) ప్రస్తావించారు. దాదాపు 20 రోజులు అలా చేయడంతో ఏమైందోనని అటు అభిమానులు, ఇటు నెటిజన్లు సందేహం
వ్యక్తం చేశారు. ఆ ఘటనపై అమితాబ్ ఎంతగా కలత చెందారో తాజా పోస్టు నిదర్శనం.