
Arjun son of vyjayanthi: మరో ఓటీటీలోకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. ఎక్కడంటే
Play all audios:

ఇంటర్నెట్‌డెస్క్: కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi). ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా (amazon prime
video) డిజిటల్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. తాజాగా మరో ఓటీటీలోనూ ఇది స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆహా (Aha) వేదికగా మే 23 నుంచి అందుబాటులోకి రానుంది. * ‘రానా నాయుడు 2’.. స్ట్రీమింగ్ డేట్
ఫిక్స్ కథేంటంటే.. వైజయంతి (విజయశాంతి) విధి నిర్వహణలో రాజీపడని పోలీస్ అధికారి. తన కొడుకు అర్జున్ విశ్వనాథ్ (కల్యాణ్‌రామ్) కూడా తనలాగే ఐపీఎస్ కావాలనేది ఆమె కల. తల్లిని
ప్రాణప్రదంగా భావించే అర్జున్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉంటాడు. కానీ, ఇంతలో చోటుచేసుకున్న తండ్రి మరణం అర్జున్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. చేతులకి సంకెళ్లు పడతాయి. ఆ తర్వాత పరిణామాలు
అతడిని గ్యాంగ్‌స్టర్‌ని చేసేస్తాయి. ప్రైవేటు సైన్యం ఏర్పాటుచేసుకుని వైజాగ్‌ని శాసిస్తుంటాడు అర్జున్. తాను కన్న కలలకి భిన్నంగా అర్జున్ జీవిత ప్రయాణం సాగడం చూసి తల్లి వైజయంతి
జీర్ణించుకోలేదు. అలా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. పోలీస్ విధుల నుంచి దూరమై, విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న వైజయంతి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంటుంది. ఇంతకీ వైజయంతిని వెంటాడుతున్నది
ఎవరు? ఆ విషయం తెలిశాక అర్జున్ ఏం చేశాడు? తన తల్లి ప్రాణాల్ని కాపాడటం కోసం ఎంత దూరం వెళ్లాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.