
Babil khan: ‘బేబీ’ రీమేక్.. వైదొలిగిన హీరో: స్పందించిన దర్శకుడు
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: రొమాంటిక్ డ్రామా మూవీ ‘బేబీ’ (Baby)తో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh). ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ఆయన ప్లాన్ చేశారు. అధికారిక
ప్రకటన లేదు గానీ అందులో హీరోగా బాబిల్ ఖాన్ (Babil Khan) ఎంపికైనట్టు బాలీవుడ్‌లో వార్తలొచ్చాయి. అయితే.. ఈ సినిమా నుంచి తాను తప్పుకొన్నట్టు బాబిల్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ
డైరెక్టర్‌తో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలని అనుకున్నానని, దురదృష్టవశాత్తూ అది సాధ్యపడడంలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నానని తెలిపిన ఆయన.. సాయి రాజేశ్, టీమ్‌కి ఆల్ ది
బెస్ట్ చెప్పారు. తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని, భవిష్యత్తులో కలిసి పని చేస్తామనే నమ్మకం ఉందన్నారు. * జయం రవి కోసం రూ.100 కోట్లు అప్పు చేశా..: నటుడిపై అత్త ఆరోపణలు దీనిపై స్పందించిన సాయి
రాజేశ్ ఓ నోట్ విడుదల చేశారు. ‘‘నేను కలిసిన ప్రతిభావంతులైన, బాగా కష్టపడే నటుల్లో బాబిల్ ఖాన్ ఒకరు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోని మిస్ అవుతున్నా. అతడి
నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. మేం తప్పకుండా మ్యాజిక్ క్రియేట్ చేస్తాం’’ అని పేర్కొన్నారు.