Chandrababu naidu: తారక రామారావు గొప్ప విజయాలు అందుకోవాలి: చంద్రబాబునాయుడు

Chandrababu naidu: తారక రామారావు గొప్ప విజయాలు అందుకోవాలి: చంద్రబాబునాయుడు

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి తారక రామారావు గొప్ప విజయాలను అందుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆకాంక్షించారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక


రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి (YVS Chowdary) కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈసందర్భంగా చంద్రబాబు


పోస్ట్‌ పెట్టారు. ‘‘తారక రామారావు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోన్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.  తారక


రామారావుకు విషెస్‌ చెబుతూ నారా భువనేశ్వరి పోస్ట్‌ పెట్టారు. ‘‘చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన బాధను అధిగమించడం నుంచి ఈరోజు హీరోగా ఎంట్రీ ఇవ్వడం వరకూ తారక్‌ ప్రయాణం మాకెంతో గర్వకారణం. నా


మనవడు నందమూరి తారక రామారావు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోన్న సందర్భంగా అభినందనలు. నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ మరిన్ని విజయాలు అందుకోవాలి’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.


  ‘‘జానకిరామ్‌ కుమారుడు.. ఎన్టీఆర్‌ మునిమనవడు తారక రామారావు సినిమా ప్రారంభోత్సవం చూసి గర్వంగా, భావోద్వేగంగా అనిపించింది. తారక్‌ను చూస్తుంటే ఎన్టీఆర్‌ మనవడిగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అతడు


ఎన్నో విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తారక్‌ నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకుతీసుకెళ్లాలి’’ అని నారా లోకేశ్ పోస్ట్‌ పెట్టారు. తారకరామారావుకు నారా బ్రాహ్మణి శుభాకాంక్షలు


చెప్పారు. ‘‘సీనియర్‌ ఎన్టీఆర్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే నటుడిగా, జానకిరామ్‌ కుమారుడిగా నీ ప్రయాణం గొప్ప సంకల్పంతో ప్రారంభమవుతోంది. నటనలో ఉన్నత శిఖరాలు అందుకొని కుటుంబంతో పాటు.. తెలుగు


సినిమా గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. * ఈ తారకరామారావు మా నాన్నంత ఎత్తుకు ఎదగాలి: నారా భువనేశ్వరి ఈ పూజా కార్యక్రమంలో హీరో తారక రామారావు మాట్లాడుతూ.. ‘‘మా ముత్తాత


ఎన్టీఆర్‌, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకిరామ్‌ ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉంటాయని నేను నమ్ముతాను. ఈరోజు నా కుటుంబసభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ


ప్రాజెక్ట్‌ ప్రకటించినప్పటినుంచి మీడియా ఎంతో సహకరించింది. వారందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను’’ అని అన్నారు.  ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఈ


ప్రారంభోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉందని వైవీఎస్‌ చౌదరి అన్నారు. ‘‘ఈ రోజును నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్టీఆర్‌ ఘాట్‌ నాకు పుణ్యక్షేత్రంతో సమానం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం ఎంతో


ఆనందంగా ఉంది. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఆయన ఉంటారు. ఆయన కుటుంబంలో నాలుగోతరానికి చెందిన వ్యక్తి.. ఆయన పేరు పెట్టుకున్న మనవడు ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభోత్సవం ఈ ప్రదేశంలో జరగడం నాకెంతో ఆనందంగా


ఉంది. ఆయన పేరు పెట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.. పేరు ఎవరైనా పెట్టుకుంటారు.. కానీ ఆ రంగంలో రాణించగలగాలి. ఇక ఈ ప్రారంభోత్సవం సీనియర్‌ ఎన్టీఆర్‌ కుమార్తెల చేతులమీదగా జరగడం నాకు


అనిర్వచనీయమైన అనుభూతి. ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఘట్టం. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం     నా అదృష్టంగా భావిస్తున్నాను. తారకరామారావుకు కుటుంబసభ్యులందరి సపోర్ట్‌ ఉంది. గొప్ప స్థానాలకు వెళ్లాలని


మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.