Heart beat season 2: మెడికల్‌ డ్రామా వెబ్‌సిరీస్‌.. ‘హార్ట్‌బీట్‌ సీజన్‌ 2’ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

Heart beat season 2: మెడికల్‌ డ్రామా వెబ్‌సిరీస్‌.. ‘హార్ట్‌బీట్‌ సీజన్‌ 2’ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

Play all audios:


గతేడాది విడుదలై, ఓటీటీ ప్రేక్షకులను అలరించిన మెడికల్‌ డ్రామా వెబ్‌సిరీస్‌ ‘హార్ట్‌బీట్‌’ (Heart Beat). మంచి ఆదరణ పొందిన ఈ సిరీస్‌ సీజన్‌ 2 (Heart Beat season 2) స్ట్రీమింగ్‌ డేట్‌ ఖరారైంది.


ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది విడుదలై, ఓటీటీ ప్రేక్షకులను అలరించిన మెడికల్‌ డ్రామా వెబ్‌సిరీస్‌ ‘హార్ట్‌బీట్‌’ (Heart Beat). మంచి ఆదరణ పొందిన ఈ సిరీస్‌ సీజన్‌ 2 (Heart Beat season 2)


స్ట్రీమింగ్‌ డేట్‌ ఖరారైంది. ‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar)లో తెలుగు, తమిళ్‌, హిందీలో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వివరాలు ప్రకటిస్తూ సదరు ఓటీటీ సంస్థ.. పాటను విడుదల చేసింది. *


దర్శకుడి కల నెరవేర్చిన సూర్య, కార్తి.. దీపా బాలు, అనుమోల్‌, చారుకేశ్‌, అమిత్‌ భార్గవ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో దీపక్‌ సుందర్‌రాజన్, అబ్దుల్‌ కబీజ్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ని తెరకెక్కించారు.


‘ఆర్కే హాస్పిటల్‌’ ఇతివృత్తంగా రూపొందిన సిరీస్‌ ఇది. 100+ ఎపిసోడ్లతో తొలి సీజన్‌ రూపొందడం విశేషం. ‘ఆర్కే హాస్పిటల్‌’ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ రతి (అనుమోల్‌)కి, అదే హాస్పిటల్‌లో కొత్తగా


చేరిన జూనియర్‌ డాక్టర్‌ రీనా (దీపా బాలు)కి ఎవరి విషయంలో మనస్పర్థలొచ్చాయి? ఓ నిజం తెలిశాక తర్వాత రీనా ఎలా స్పందించింది? తదితర అంశాలతో సీజన్‌ 1 తెరకెక్కింది.  ఇటీవల విడుదలైన ప్రోమో సీజన్‌పై


ఆసక్తి పెంచేలా ఉంది. ‘శరీరంలో చోటుచేసుకునే హార్మోనుల మార్పుల్లాగే నా లైఫ్‌లో, ఈ హాస్పిటల్‌లో ఎన్నో మార్పులొచ్చాయి’’, ‘‘అదే హార్ట్‌గానీ బీట్‌ మారింది’’ అని డాక్టర్‌ రీనా చెప్పిన డైలాగ్స్‌..


సీజన్‌ 2లో ఆమె పాత్ర కొత్తగా ఉండబోతోందని తెలియజేస్తున్నాయి.