2025 honda rebel 500: మార్కెట్లోకి హోండా రెబల్‌ 500.. ధర @రూ. 5. 12 లక్షలు

2025 honda rebel 500: మార్కెట్లోకి హోండా రెబల్‌ 500.. ధర @రూ. 5. 12 లక్షలు

Play all audios:


2025 Honda Rebel 500 | ఇంటర్నెట్‌ డెస్క్‌: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా కొత్త మోటార్‌ సైకిల్‌ను దేశీయ మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. హోండా రెబల్‌ 500 (2025 Honda Rebel 500)


పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఈ మోటార్‌ సైకిల్‌ ప్రారంభ ధర రూ.5.12 లక్షలు (ఎక్స్- షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. గురుగ్రామ్‌, ముంబయి, బెంగళూరులోని ఎంపిక చేసిన బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌లో


బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూన్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రెబల్‌ 500 ట్యూబులర్‌ స్టీల్ ఫ్రేమ్‌తో వస్తోంది. స్ట్రిప్డ్‌- బ్యాక్‌, బాబర్‌ స్ట్రైల్‌


ఫ్యాట్‌- టైర్లతో తీసుకొచ్చారు. ఇందులో 471 సీసీ లిక్విడ్‌- కూల్డ్‌, 4- స్ట్రోక్‌, 8- వాల్వ్‌, లిక్విడ్‌- కూల్డ్‌ ప్యార్లల్‌ ట్విన్‌- సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. 6- స్పీడ్ గేర్‌బాక్స్‌తో


వస్తోంది. ఈ మోటార్‌ సైకిల్‌ 8,500 RPM వద్ద 45.59 hp గరిష్ఠ శక్తిని, 43.3 Nmని ఉత్పత్తి చేస్తుంది. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో తీసుకొచ్చారు. రెండు డిస్క్‌బ్రేక్‌లు, డ్యూయల్‌ ఛానల్‌


ఏబీఎస్‌తో వస్తోంది. ఎల్‌ఈడీ లైటింగ్‌, సిగ్నేచర్‌ రౌండ్‌ హెడ్‌ల్యాంప్‌తో ఈ మోటార్‌ సైకిల్‌ వస్తోంది. కొత్త బైక్‌ లాంచ్‌పై కంపెనీ ఎండీ, సీఈఓ సుత్సుము ఒటాని హర్షం వ్యక్తం చేశారు.


ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాదించుకున్న రెబల్‌ 500ను భారత్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న బైక్‌ను ఎట్టకేటకు భారత్‌లోకి తీసుకొచ్చాం. కొత్త హంగులతో దీన్ని లాంచ్‌


చేశాం’’ అని కంపెనీ డైరక్టర్‌ యోగేష్‌ మాథుర్‌ ఆనందం వ్యక్తం చేశారు.