
Kamal haasan: సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదు: కమల్‌హాసన్
Play all audios:

‘థగ్ లైఫ్’ (Thug Life) ఈవెంట్‌లో తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan). పదవుల కోసం తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని అన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: అగ్ర నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life). మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం చెన్నై
వేదికగా జరిగింది. ఇందులో పాల్గొన్న కమల్ హాసన్ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. తాము గొప్ప సినిమా రూపొందించామని.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం
తన రాజకీయ జీవితం పై మాట్లాడారు. పదవుల మీద వ్యామోహంతో తాను పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టలేదన్నారు. * బీప్ సాంగ్.. రెడ్‌కార్డ్..: కాంట్రవర్సీపై శింబు కన్నీళ్లు ‘‘ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో
రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. తమిళనాడు రాష్ట్ర ప్రజలకు నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చా. ప్రజల కోసం మేము వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. నిదానంగా అనుకున్నది సాధిస్తాం. ఈ ప్రయాణంలో నాతో
భాగమైన వారికి ధన్యవాదాలు. వాళ్లు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అందుకు నేనెంతో గర్వపడుతున్నా. శింబు మీరు కూడా మీ వాళ్ల కోసం నిలబడాలి. వాళ్లను అలరించడం కోసం మరింత శ్రమించాలి. మా సినిమా
‘థగ్‌లైఫ్’ విషయంలో నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారు. శాటిలైట్, ఓటీటీ హక్కులు మాత్రమే బయటవాళ్లకు అమ్మాను. డిస్ట్రిబ్యూషన్ మేమే చేస్తున్నాం. మేము ఒక మంచి
చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులు ఆదరిస్తే.. మా నిర్మాణ సంస్థలో ఇలాంటి ఎన్నో గొప్ప చిత్రాలను రూపొందిస్తాం. ఈ సినిమాలో మలయాళ నటుడు జోజూ జార్జ్ కీలక పాత్ర పోషించారు. నటీనటులు ఏదైనా కొత్తగా
ప్రయత్నిస్తే.. వారిని నేను పోటీగా తీసుకుంటా. కానీ, జోజూ విషయంలో మాత్రం అసూయ ఫీలవుతుంటా. ఆయన అద్భుతంగా వర్క్ చేస్తుంటారు. ఏది ఏమైనా నటీనటులను స్వాగతించాల్సిన బాధ్యత నాపై ఉంది’’ అని కమల్
హాసన్ అన్నారు. ఆయన మాటలతో జోజూ ఎమోషనల్ అయ్యారు. మూడు రోజులు స్నానం చేయలేదు: శివ రాజ్‌కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar).
కమల్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ‘‘నా చిన్నతనంలో నాన్నను కలవడానికి తొలిసారి కమల్‌హాసన్ మా ఇంటికి వచ్చారు. అక్కడే ఉన్న నా గురించి ఆయన ఆరా తీయగా.. నాన్న పరిచయం చేశారు. ఆ క్షణం
ఆయన్ని ప్రేమగా హత్తుకున్నా. ఆ అనుభూతి చెదిరిపోకూడదని భావించా. మూడు రోజులపాటు స్నానం చేయలేదు. ఆయన అంటే నాకంత ఇష్టం. ఆయన నటించిన అన్ని సినిమాలు చూస్తుంటా. ఇటీవల నాకు క్యాన్సర్ ట్రీట్‌మెంట్
జరిగిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కమల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన మాట్లాడుతుంటే ధైర్యంగా అనిపించింది. ‘శివన్నా.. నీకు తెలుసా.. నీతో మాట్లాడుతుంటే నాకెందుకో కన్నీళ్లు వస్తున్నాయి’
అన్నారు. ఆ క్షణం మా నాన్నతో మాట్లాడుతున్నట్లు అనిపించింది’’ అని శివన్న వివరించారు.