Lik: నయన్‌ భర్త కొత్త చిత్రం.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..?

Lik: నయన్‌ భర్త కొత్త చిత్రం.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..?

Play all audios:


నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇంటర్నెట్‌డెస్క్‌: నటి నయనతార


(Nayanthara) భర్త విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఎల్‌ఐకే’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ). ప్రదీప్‌ రంగనాథన్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2023లో


పట్టాలెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా చిత్రబృందం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 18న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. టైమ్‌


ట్రావెల్‌ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. * యాక్టింగ్‌ మానేసి.. ఇడ్లీలు అమ్ముకోమన్నారు: నటుడు వివాదాలు ఎదుర్కొని..! ఈ సినిమా విషయంలో విఘ్నేశ్‌


శివన్‌ పలు వివాదాలు ఎదుర్కొన్నారు. తొలుత ఈ చిత్రాన్ని నటుడు శివకార్తికేయన్‌తో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై చేస్తున్నట్లు 2019లో వార్తలు వచ్చాయి. అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఈ


క్రమంలోనే 2023లో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా విఘ్నేశ్‌ శివన్‌ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. మొదట ఈ చిత్రానికి ‘ఎల్‌ఐసీ’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) (LIC) అనే టైటిల్‌ పెట్టారు.


దీంతో ఎల్‌ఐసీ సంస్థ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని.. సినిమా కోసం ఈ టైటిల్‌ను ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. వారం


రోజుల్లోగా పేరు మార్చకపోతే లీగల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే తమ సినిమా టైటిల్‌ను ‘ఎల్‌ఐసీ’ నుంచి ‘ఎల్‌ఐకే’గా మార్చారు. ప్రస్తుతం ఇది సెవెన్‌ స్క్రీన్‌


స్టూడియో పతాకంపై నిర్మితమవుతోంది.