
Raashii khann: రాశీ ఖన్నాకు గాయాలు.. ఫొటోలు షేర్ చేసిన నటి
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం తెరవెనక నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్ సమయంలో అయ్యే గాయాలను కూడా లెక్క చేయరు. తాజాగా నటి రాశీఖన్నాకు (Raashii Khann) ఓ
షూటింగ్‌లో గాయలయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె పోస్ట్ పెట్టారు. ‘కథ డిమాండ్ చేస్తే.. గాయాలను కూడా లెక్క చేయకూడదు. మనమే ఒక తుపాను అయినప్పుడు మనల్ని ఏ పిడుగు ఆపలేదు’ అని క్యాప్షన్ పెడుతూ
కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అందులో ఆమెకు చిన్నచిన్న దెబ్బలు తగిలినట్లు కనిపిస్తున్నాయి. ‘ఫర్జీ 2’ షూటింగ్‌లో గాయాలయ్యాయా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. * ఆర్థిక ఇబ్బందుల కారణంగా
వారు మద్దతు ఇవ్వలేదు: అజిత్ షాహిద్‌కపూర్, రాశీఖన్నా, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ఈ సిరీస్ ఓటీటీలో రికార్డులు
సృష్టించింది. దీని సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల దీని చిత్రీకరణ ప్రారంభమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాశీఖన్నాకు ఈ సిరీస్ షూటింగ్‌లోనే
గాయాలైనట్లు అభిమానులు భావిస్తున్నారు.