
Itr-3 form: అందుబాటులోకి ఐటీఆర్-3 ఫారమ్.. ఎవరు, ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోండి..
Play all audios:

* ITR-3 ఫారమ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? - ముందు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometaxindiaefiling.gov.in/homeను ఓపెన్ చేయాలి. - డౌన్‌లోడ్ ట్యాబ్‌కి వెళ్లి, ‘ఆఫ్‌లైన్
యుటిలిటీస్’పై క్లిక్ చేయాలి. - తర్వాత ‘ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపరేషన్ యుటిలిటీస్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. - సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంచుకోవాలి. - ITR 3 కాలమ్‌లోని వివరాలను
మాన్యువల్‌గా పూరించడానికి, ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ‘ఎక్సెల్ యుటిలిటీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. advertisement - చివరిగా డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేసి, అవసరమైన వివరాలతో
నింపాలి. * ITR-3 ఫారమ్‌ను ఎలా ఫైల్ చేయాలి? డిజిటల్ సిగ్నేచర్‌తో రిటర్న్‌ను ఎలక్ట్రానిక్‌గా సబ్మిట్ చేయవచ్చు. డేటాను ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌మిట్ చేయాలి, ఫారమ్ ITR-Vలో రిటర్న్ వెరిఫికేషన్
సబ్మిట్ చేయాలి. సక్రమంగా పూర్తి చేసిన ITR-V ఫారమ్ (అక్నాలెడ్జ్‌మెంట్)ను ఆదాయ పన్ను కార్యాలయానికి మెయిల్ చేయాలి. ITR-3 ఫారమ్‌ను ఫైల్ చేసే పన్ను చెల్లింపుదారులు ఈ పద్ధతిని అనుసరించాలి.
advertisement * ఫారమ్ 26AS చెక్ చేయాలి పన్ను చెల్లింపుదారులందరూ తమ ఐటీఆర్‌ను ఫైల్ చేసే ముందు తమ ఫారమ్ 26AS తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఫారం 26AS ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి డిడక్ట్ చేసిన
అన్ని పన్నుల వివరాలను కలిగి ఉంటుంది. ఫారమ్ 26ASను చెక్ చేసి, అన్ని ట్యాక్స్ డిడక్షన్‌లను కచ్చితంగా లెక్కించినట్లు నిర్ధారించుకోవచ్చు. ఏవైనా తప్పులు దొర్లిఉంటే సులువుగా తెలుసుకునే అవకాశం
ఉంటుంది. advertisement * ఇన్‌కమ్ సోర్సెస్ అన్నీ పేర్కొనాలి ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు, అన్ని ఇన్‌కమ్ సోర్స్‌లను కచ్చితంగా పేర్కొనాలి. ఇందులో శాలరీ, ఇంట్రస్ట్ ద్వారా లభించే
ఇన్‌కమ్, రెంటల్ ఇన్‌కమ్, క్యాపిటల్ గెయిన్స్ ప్రాఫిట్స్ వంటివి ఉంటాయి. అన్ని ఇన్‌కమ్ సోర్స్‌లను రిపోర్ట్ చేయకపోతే, చట్టపరమైన చర్యలు, పెనాల్టీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. advertisement *
అన్ని డిడక్షన్‌లు క్లెయిమ్ చేయాలి అర్హులైన అన్ని డిడక్షన్‌లను క్లెయిమ్ చేయడం ముఖ్యం. సెక్షన్ 80C కింద ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా సెక్షన్ 80D కింద వైద్య ఖర్చులు వంటి డిడక్షన్‌లు ట్యాక్స్
లయబిలిటీని తగ్గించడంలో సహాయపడతాయి. ట్యాక్స్ సేవింగ్స్‌ను ఆప్టిమైజ్ చేయడానికి అన్ని ఎలిజిబిల్ డిడక్షన్‌లను క్లెయిమ్ చేసుకోవాలి. Location : Hyderabad,Telangana Vijayawada,Krishna,Andhra
Pradesh First Published : June 16, 2023 6:20 PM IST