
Rrr: లండన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫొటోలు వైరల్
Play all audios:

లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు. ఈ వేడుకలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఇంటర్నెట్
డెస్క్: ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది తెలుగు సినిమా ‘ఆర్ఆర్‌ఆర్’ (RRR). ఇప్పుడు మరోసారి ఆ పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. తాజాగా లండన్‌లోని
ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు. రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన ప్రదర్శనతో
అతిథులను మంత్రముగ్దుల్ని చేశారు. ఈవెంట్‌కు మూవీ హీరోలు ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan), డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి ముందస్తుగా రామ్‌చరణ్
జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దీంతో అభిమానులు కేకలతో హోరెత్తించారు. ఒకే వేదికపై ఇద్దరు అగ్ర హీరోలు, దర్శకుడు రాజమౌళి కనిపించడంతో అక్కడి అతిథులు, సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆనందం
వ్యక్తం చేశారు. ఈ స్టార్ హీరోల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా (#SSMB29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
‘బాహుబలి 2’ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్ కాన్సర్ట్ చేసిన తొలి విదేశీ చిత్రంగా ‘బాహుబలి 2’ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిలిచింది. రెండూ రాజమౌళి
దర్శకత్వం వహించిన సినిమాలే కావడం విశేషం.