
Upcoming movies telugu: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే..
Play all audios:

అటు వేసవి, ఇటు ఐపీఎల్ సీజన్ ముగింపునకు వచ్చిన వేళ థియేటర్‌లో సినిమాల సందడి మొదలవుతోంది. మే చివరి వారంలో థియేటర్‌తో పాటు, ఓటీటీలో పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఓ
గుడి.. ముగ్గురు మిత్రుల కథ.. Bhairavam Movie || బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ (Manchu Manoj) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం
‘భైరవం’. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమాని కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 30న (bhairavam
release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇది ఓ గుడి, ముగ్గురు మిత్రుల చుట్టూ సాగే యాక్షన్ కథని
అర్థమవుతోంది. ‘నాంది’ చూసి అందరూ ఎంత థ్రిల్ ఫీలయ్యారో.. ఈ సినిమా చూసి కూడా అంతే థ్రిల్‌గా, ఎమోషనల్‌గా ఫీలవుతారని దర్శకుడు విజయ్ కనకమేడల అంటున్నారు. ------------------------- కుటుంబ
భావోద్వేగాలతో.. Shashtipoorthi Movie || రూపేశ్, ఆకాంక్ష సింగ్ జంటగా పవన్ ప్రభ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈనెల 30న
థియేటర్లలోకి రానుంది. బలమైన కుటుంబ భావోద్వేగాలతో పాటు ప్రేమ, యాక్షన్‌లకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే, అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.
------------------------- ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు * నెట్‌ఫ్లిక్స్ * ఎఫ్:1 ది అకాడమీ (వెబ్‌సిరీస్) మే 28 * హిట్ 3 (మూవీ) మే 29 * * డిపార్ట్‌మెంట్.క్యూ (ఇంగ్లీష్)
మే 29 * ఏ విడోస్ గేమ్ (మూవీ) మే 30 * లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (యానిమేషన్) మే 30 * ద హార్ట్ నోస్ (మూవీ) మే 30 * రెట్రో (తెలుగు) మే 31 * హాట్‌స్టార్ * కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ
వరల్డ్ (మూవీ) మే 28 * క్రిమినల్ జస్టిస్ 4 (సిరీస్) మే 29 * ఏ కంప్లీట్ అన్‌నోస్ (మూవీ) మే 31 * తుడరమ్ (మూవీ) మే 30 * * జీ5 * అజ్ఞాత వాసి (మూవీ) మే 28 * సోనీలివ్ * కంఖజురా (హిందీ
సిరీస్) మే 20