
Vijay sethupathi: గుర్తింపు లేనప్పుడు సాయం చేయడం గొప్ప విషయం: విజయ్ సేతుపతి
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: తన నటనతో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ప్రస్తుతం ‘ఏస్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. దర్శకుడు ఆర్ముగ కుమార్‌కు జీవితమంతా రుణపడి ఉంటానన్నారు. తాను నటుడిగా కెరీర్ ప్రారంభించడానికి ఆయనే కారణమన్నారు.
ఆర్ముగ కుమార్ వల్లే తనకు ‘96’ సినిమాలో అవకాశం వచ్చిందన్నారు. ‘‘మొదటిసారి అవకాశం కోసం వెతుకుతున్నప్పుడు ‘వర్ణం’ అనే సినిమాకు ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడికి వెళ్లాక సన్నివేశం చెప్పి డైలాగులు
కూడా నన్నే రాసుకొని నటించమని అడిగారు. నేను డైలాగులు కూడా రాయగలనని అప్పుడే తెలుసుకున్నాను. ఆర్ముగ కుమార్ ఆ టీమ్‌కు నా పేరు సిఫార్స్ చేశారు. అలా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. అలాగే కల్ట్
క్లాసిక్ మూవీ ‘96’లో నేను నటించడానికి కూడా ఆయనే కారణం. ‘దయచేసి ఒకసారి ఈ సినిమాకు విజయ్ సేతుపతి ఆడిషన్ తీసుకోండి. పాత్రకు సరిపోడు అనుకుంటే తిరస్కరించండి’ అని ఆర్ముగ కుమార్ ‘96’ టీమ్‌కు
వెల్లడించారు. మనకు ఒక స్థాయి వచ్చాక ఎవరైనా మనకు సాయం చేస్తారు. కానీ, మనం ఎవరో తెలియనప్పుడు కూడా సాయం చేయడం గొప్ప విషయం. ఆ సాయం చిమ్మ చీకటిలో నిండిన ఇంటిలో దీపం వెలిగించడం లాంటింది. ఆరోజు నా
జీవితంలో ఆ దీపాన్ని వెలిగించిన వ్యక్తి ఆర్ముగ కుమార్. అతడికి రుణపడి ఉంటాను’’ అని విజయ్ సేతుపతి చెప్పారు. * బాబాయ్.. ఏది ఏమైనా నీకు అండగా ఉంటా: మనోజ్‌పై నారా రోహిత్ పోస్ట్ ప్రస్తుతం
విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఏస్’ (Ace) విడుదలకు సిద్ధంగా ఉంది. ఆర్ముగకుమార్ దర్శకుడు. తమిళంతో పాటు, తెలుగులోనూ మే 23న ఈ చిత్రం
ప్రేక్షకుల ముందుకురానుంది.