Ipl - war: ఐపీఎల్‌ ఫైనల్‌.. సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న ‘వార్‌ 2’ టీమ్

Ipl - war: ఐపీఎల్‌ ఫైనల్‌.. సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న ‘వార్‌ 2’ టీమ్

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తోన్న క్షణాలు వచ్చేశాయి. ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌ ముగింపు దశకు వచ్చేసింది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే


ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్లు తలపడనున్నాయి. అయితే ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో సినీ ప్రియులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు ప్రముఖ


నిర్మాణ సంస్థ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్‌ 2’ (WAR 2).  హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ (NTR) కలిసి


నటిస్తున్న చిత్రమిది. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో భాగంగా నేడు జరగనున్న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం ప్రసారం


చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఈ నిర్మాణ సంస్థ ప్రణాళికలు యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఏర్పాట్లుచేస్తున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హృతిక్‌, ఎన్టీఆర్‌ల పాత్రలకు


సంబంధించిన వీడియోను ఓవర్‌ బ్రేక్‌ల మధ్య ప్రసారం చేయనున్నారట. * వర్కింగ్‌ అవర్స్‌.. అలా అడగడంలో తప్పులేదు: మణిరత్నం ఇటీవల ఎన్టీఆర్‌ పుట్టినరోజు నాడు నిర్మాణ సంస్థ అభిమానులను సర్‌ప్రైజ్‌


చేస్తూ టీజర్‌ను విడుదల చేసింది. దీంతో ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్‌ సంబర పడుతున్నారు. వై.ఆర్‌.ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఆరో చిత్రమిది. అయాన్‌


ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.


భారీ వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో రికార్డులు సృష్టించింది.