
Telangana formation: న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Play all audios:

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (NYTTA) ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలతో పాటు బాలోత్సవాన్ని నిర్వహించారు.
బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్‌టీటీఏ అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో
వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ప్రవాసులు ఆకాంక్షించారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు
మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్‌లో భాగంగా చిన్నారులు తమ టాలెంట్ షోతో ఆకట్టుకున్నారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ.. ఇలా పలు రకాల పోటీలు ఉత్సవంలో ఆకర్షణీయంగా నిలిచాయి. విజేతలకు
అసోసియేషన్ తరఫున బహుమతులు అందించారు. వేడుకలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఎన్‌వైటీటీఏ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం
రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.