
Mumbai indians: ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు
Play all audios:

ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థానంలో బెయిర్ స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్నెట్ డెస్క్: విదేశీ ఆటగాళ్ల
గైర్హాజరీ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians).. జానీ బెయిర్ స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో
ఐపీఎల్ (IPL) ఓ వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా పునఃప్రారంభమైన తర్వాత విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ తిరిగి ముంబయి జట్టులో చేరలేదు. అందుకే వీరి స్థానాల్లో
కొత్త ఆటగాళ్లను ముంబయి తీసుకుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరగనున్న వన్డే సిరీస్‌లో విల్‌జాక్స్ పాల్గొనాల్సి ఉంది. అందుకే అతడు తిరిగి భారత్ రాలేకపోతున్నాడు. అలాగే దక్షిణాఫ్రికా
ఆటగాళ్లైన రికెల్‌టన్, కార్బిన్ బోష్.. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (ICC World Test Championship) ఫైనల్‌లో తలపడనున్నారు. దీంతో వీరు సైతం తిరిగి ఐపీఎల్‌లో
పాల్గొనలేకపోతున్నారు. బెయిర్‌స్టో గత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తరఫున బరిలోకి దిగాడు. 2025 సీజన్‌లో మాత్రం అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ప్రస్తుతం ముంబయి అతడితో 5.25
కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ముంబయి ఇండియన్స్‌ను ప్లేఆఫ్స్‌నకు చేర్చడానికి బెయిర్‌స్టో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. రిచర్డ్ గ్లీసన్‌ను రూ.కోటికి ముంబయి సొంతం చేసుకుంది. అతడు గత
సీజన్‌లో కొంతకాలం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టులో కొనసాగాడు. చరిత్ అసలంకకు రూ.75 లక్షలు చెల్లించనుంది. చరిత్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
(Royal Challengers Bengaluru), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ ఇప్పటికే తమ ప్లేఆఫ్స్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో
స్థానంలో కొనసాగుతోంది. మే 21న దిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో, మే 26న పంజాబ్‌కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లోనూ విజయం సాధించడంపై ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్‌నకు
చేరుకునే విషయం ఆధారపడి ఉంది.