Israel-hamas conflict: గాజాలోని ప్రతి చిన్నారీ మాకు శత్రువే.. ఇజ్రాయెల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Israel-hamas conflict: గాజాలోని ప్రతి చిన్నారీ మాకు శత్రువే.. ఇజ్రాయెల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణలతో (Israel-Hamas Conflict) గాజా (Gaza)లోని సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బతికున్నవారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నగరం


గురించి ఇజ్రాయెల్ నేత మోషే ఫైగ్లిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న ప్రతి చిన్నారీ తమకు శత్రువేనని వ్యాఖ్యానించారు. ‘‘మా శత్రువు హమాస్‌, దాని మిలిటరీ వింగ్ మాత్రమే కాదు. గాజాలోని


ప్రతిబిడ్డా మాకు శత్రువే. ఆ నగరాన్ని మేం ఆక్రమించుకొని, అక్కడ స్థిరపడాలి. అక్కడ ఒక్క బిడ్డ కూడా మిగలదు. దానికి మించి మరో విజయం లేదు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని


బెంజమిన్ నెతన్యాహుపై ఐడీఎఫ్ (Israel Defense Forces) విశ్రాంత చీఫ్ యాయిర్‌ గొలాన్‌ మండిపడ్డారు. చిన్నారులను చంపడం హాబీగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈక్రమంలోనే మోషే నుంచి స్పందన వచ్చింది.


* గాజాలో ఉద్రిక్తతల వేళ.. అమెరికాలో ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బంది హత్య 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య జరుగుతోన్న పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం


వెల్లడించింది. ఐడీఎఫ్‌ చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం కోసం జరుగుతోన్న చర్చలను బ్రిటన్ ఆపివేసింది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా


సహాయాన్ని నెతన్యాహు ప్రభుత్వం నిలిపివేసింది. మిత్ర దేశాల నుంచి దౌత్యపరంగా వచ్చిన ఒత్తిడితో పరిమిత మానవతా సాయానికి ఇటీవల నెతన్యాహు అంగీకరించారు. గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని


ఇజ్రాయెల్‌ ప్రధాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘గిడియన్‌ చారియట్స్‌’ పేరుతో ఇజ్రాయెల్‌ సైన్యం గాజా వ్యాప్తంగా భూతల దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పోరాటం తీవ్ర


స్థాయిలో ఉంది. పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గేదే లేదు’’ అని పేర్కొన్నారు.