Sunita williams: మరోసారి సునీతా విలియమ్స్‌ ‘స్పేస్‌వాక్‌’..

Sunita williams: మరోసారి సునీతా విలియమ్స్‌ ‘స్పేస్‌వాక్‌’..

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్: సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్‌ (Sunita Williams) మరోసారి ‘స్పేస్‌వాక్‌’ (spacewalk) నిర్వహించారు. ఎనిమిది నెలల


తర్వాత రెండోసారి ఆమె కేంద్రం వెలుపలకు వచ్చారు. మరో వ్యోమగామి విల్‌మోర్‌, సునీతా శూన్యంలో వాక్‌ చేశారు.  సునీత విలియమ్స్‌, విల్‌మోర్‌లు ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా గతేడాది జూన్‌ 6న బోయింగ్‌


స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో ‘ఐఎస్‌ఎస్‌’కు వెళ్లిన సంగతి తెలిసిందే. అదే నెల 14న వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం


స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. నాసా (NASA)కు చెందిన మరో వ్యోమగామితో కలిసి ఐఎస్‌ఎస్‌కు సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది.  * ఆ విమానంలోని 64 మంది మృతి చెందినట్లే..:


ఫైర్‌ చీఫ్‌ 2012లో ఆమె చివరిసారి స్పేస్‌వాక్‌ నిర్వహించగా.. ఇటీవల ఆమె ఎనిమిదోసారి వాక్‌ చేశారు. తాజాగా మరోసారి స్పేస్‌వాక్‌ చేశారు. సునీతా ప్రస్తుతం మూడో రోదసి యాత్రలో ఉన్నారు. గతంలో 2006,


2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. 2012 నాటికి ఏడు స్పేస్‌వాక్‌లు నిర్వహించి.. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో భూమికి తిరుగు ప్రయాణమయ్యే


అవకాశం ఉందని సమాచారం.