
Trump: వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు: చైనా విద్యార్థులను ఉద్దేశించి ట్రంప్
Play all audios:

Trump-China: చైనా విద్యార్థుల విషయంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో చేసిన ప్రకటనకు భిన్నంగా ట్రంప్ స్పందించారు. ఇంటర్నెట్‌డెస్క్: చైనా విద్యార్థుల వీసాలపై దృష్టి సారిస్తామని
ఇటీవల అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందన మాత్రం కాస్త భిన్నంగా ఉంది. చైనా (China)
నుంచి వచ్చిన విద్యార్థులకు భరోసా ఇచ్చేలా మీడియాతో మాట్లాడారు (Visa Crackdown) ‘‘అంతా బాగానే ఉంటారు. అంతా బాగానే జరుగుతుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు’’ అని సమాధానం ఇచ్చారు. విదేశీ
విద్యార్థుల విషయంలో అమెరికా (USA) ప్రభుత్వం కఠిన విధానాలను అమలుచేస్తోంది. అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థుల్లో కొందరి వీసాలు రద్దు చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో
ప్రకటించారు. వారిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నవారు కూడా ఉంటారని తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అమెరికా నిర్ణయంపై చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలాగే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల (Student Visa Interviews) షెడ్యులింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అన్నది అంచనా వేయడం కోసం వారి ఆన్‌లైన్ యాక్టివిటీని తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అధికారులు నిశితంగా తనిఖీ చేయనున్నారు. ఈ పరిణామాల వేళ
అమెరికా చర్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడారు. అంతర్జాతీయ విద్యార్థులతో సహా చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను
కోరుతున్నామన్నారు. ఇరుదేశాల మధ్య విద్యాపరమైన విషయాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలని సూచించారు.