
Icici lombard: మోటార్ ఇన్సూరెన్స్ లో ఐసీఐసీఐ కొత్త పాలసీ.. దీంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Play all audios:

Published by: Last Updated:July 28, 2022 2:22 PM IST ప్రైవేట్ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్(ICICI LOMBARD) జనరల్ ఇన్సూరెన్స్ బుధవారం మోటార్ విభాగంలో పెరుగుతున్న
ట్రెండ్‌లో చేరింది. పే-యాజ్-యు-డ్రైవ్(PAY-AS-YOU-DRIVE)పాలసీని అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. జూన్ త్రైమాసికానికి సంబంధించి ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. లాభాల్లో
50 శాతం వృద్ధిని నమోదు చేస్తూ.. రూ.6,905 కోట్లకు చేరుకుంది. కేటాయింపులు బాగా క్షీణించాయి. దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇయర్ ఆన్ ఇయర్ 50 శాతం అభివృద్ధిని సాధించింది.
బ్యాడ్‌లోన్ ప్రొవిజన్స్ తగ్గడంతో 2022 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,905 కోట్లు లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.13,210 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే
కాలంలో నికర వడ్డీ ఆదాయం రూ.10,936 కోట్లుగా ఉంది. అడ్వాన్సులలో 21 శాతం వృద్ధి, డిపాజిట్ల(Deposit)లో 13 శాతం పెరుగుదల కనిపించింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆస్తి నాణ్యత మెరుగుపడింది. ప్రైవేట్
రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్(Insurance) కంపెనీ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ బుధవారం మోటార్ విభాగంలో పెరుగుతున్న ట్రెండ్‌లో చేరింది. పే-యాజ్-యు-డ్రైవ్(pay-as-you-drive)పాలసీని
అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఐసీఐసీఐ లాంబార్డ్ కొత్త ఆఫర్ పే-యాజ్-యు-డ్రైవ్ మోటార్ పాలసీలో, పాలసీదారు వాహనం నడిపే సగటు దూరం ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ
(HDFC)ఎర్గో, బజాజ్ అలయన్జ్ జనరల్, డిజిట్ ఇన్సూరెన్స్, మరికొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ రకమైన మోటార్ కవర్‌ను అందిస్తున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ ఈ కొత్త ఆఫర్‌ను మోటార్ ఫ్లోటర్ పాలసీగా
పేర్కొంది. ఈ సంప్రదాయ మోటార్ పాలసీ అన్ని కవర్‌లను అందిస్తుంది (యాక్సిడెంట్ కవర్, థర్డ్-పార్టీ లయబిలిటీ, ఓనర్-డ్రైవర్‌కి వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ వంటివి). ఇప్పుడు యాడ్ ఆన్ బెనిఫిట్
అందిస్తోంది. అన్ని వాహనాలను ఒకే పాలసీలో యాడ్ చేసే అవకాశం ఉందని ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. బేసిక్ మోటార్ కవర్‌ను 'అసెట్ కమ్ యూసేజ్'
బేస్డ్ ప్రొడక్ట్‌గా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్‌తోపాటు ఇప్పుడు ఈ కొత్త పే-యాజ్-యు-డ్రైవ్ పాలసీని అందిస్తోంది. ఇందులో ప్రాథమిక మోటారు వాహనం ప్రీమియం, వాహనాన్ని వినియోగించడంపై పాక్షికంగా
ఆధారపడి ఉంటుంది. advertisement ఈ పాలసీ కింద రెండు ఆఫర్‌లు లభిస్తాయని సంజీవ్ మంత్రి వివరించారు. అవి.. మొదటిది, 'పే యాజ్ యు యూజ్’ ప్లాన్‌లో కిలోమీటర్‌ల ఆధారంగా ఆఫర్‌లను సెలక్ట్
చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీని వల్ల వాహనం వినియోగం లేదా ఎంత వినియోగించవచ్చు అని వినియోగదారు సెలక్ట్ చేసుకున్న అంచనా మేరకు ప్రీమియం ఉంటుంది. డ్రైవింగ్ ప్రవర్తన స్కోర్‌ల ఆధారంగా
ప్రీమియం మారే 'పే-హౌ-యు-యూజ్' ప్లాన్ అనేది రెండో ఆప్షన్. నిబంధనల మేరకు, మార్గదర్శకాలను పాటిస్తే డ్రైవింగ్ చేసే కస్టమర్.. పాలసీ బేస్ ప్రీమియం కంటే ఆకర్షణీయమైన తగ్గింపులను
పొందవచ్చు. advertisement మోటార్ ఫ్లోటర్ పాలసీని ఎంచుకునే కస్టమర్లకు ఆఫర్ కింద ఇన్సూరెన్స్ చేసిన ఎక్కువ వాహనాలకు తక్కువ ప్రీమియం అందిస్తారు. ఉన్న ప్రతి వాహనానికి మల్టిపుల్ పాలసీలు
నిర్వహించే శ్రమ తప్పుతుంది. పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్‌లు లేని పక్షంలో, రెన్యూవల్స్‌పై పాలసీదారులకు 50 శాతం వరకు నో-క్లెయిమ్ బోనస్ అందుతుంది. Location : First Published : July 28, 2022
2:22 PM IST Read More