Rare surgery: మహిళకు అరుదైన ఆపరేషన్ చేసిన ఢిల్లీ వైద్యులు.. 30 ఏళ్ల తరువాత పూర్తిగా నోరు తెరిచిన బాధితురాలు

Rare surgery: మహిళకు అరుదైన ఆపరేషన్ చేసిన ఢిల్లీ వైద్యులు.. 30 ఏళ్ల తరువాత పూర్తిగా నోరు తెరిచిన బాధితురాలు

Play all audios:


Last Updated:March 31, 2021 5:25 PM IST ఆ యువతికి దవడ ఎముక జాయింట్లు పుర్రె ఎముకలోకి చొచ్చుకొని ఉన్నాయి. దీంతో ఆమె నోరు తెరవడం కష్టంగా ఉండేది. ఆహార పదార్థాలు తినలేనందువల్ల ఆమె కేవలం


ద్రవాహారమే తీసుకునేది. దీనికి చికిత్స కోసం ఎన్ని హాస్పిటళ్లను సంప్రదించినా ఫలితం దక్కలేదు. కానీ ఇటీవల... మనం నోటిని పూర్తిగా తెరిస్తేనే ఆహారం తీనడానికి వీలవుతుంది. మరి నోటిని పూర్తిగా


తెరవలేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నారా? ఇలాంటి సమస్యతో 30 ఏళ్లుగా బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు ఢిల్లీ వైద్యులు. ఆస్తా మోంగియా అనే ఆ యువతికి దవడ


ఎముక జాయింట్లు పుర్రె ఎముకలోకి చొచ్చుకొని ఉన్నాయి. దీంతో ఆమె నోరు తెరవడం కష్టంగా ఉండేది. ఆహార పదార్థాలు తినలేనందువల్ల ఆమె కేవలం ద్రవాహారమే తీసుకునేది. దీనికి చికిత్స కోసం ఎన్ని హాస్పిటళ్లను


సంప్రదించినా ఫలితం దక్కలేదు. కానీ ఇటీవల న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో ఆమెకు సర్జరీ చేశారు. ఆపరేషన్ తరువాత ఆస్తా మొదటిసారి నోరు తెరిచింది. నోరు తెరవలేక ఆస్తా ఎన్నో ఇబ్బందులు


ఎదుర్కొనేది. ఆమె పళ్ల మధ్య నుంచి నాలుక బయటకు వచ్చేంత సందు కూడా ఉండేది కాదు. దీంతో సరిగా మాట్లాడటేకపోయేది. ఆమెకు పళ్లు తోముకోవడం కూడా సాధ్యం కాలేదు. ఫలితంగా దంతక్షయం, ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల


కొన్ని పళ్లు ఊడిపోయాయి. సుమారు 30 స౦వత్సరాలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఆపరేషన్ తరువాత ఆస్తా కొన్ని సెంటీమీటర్ల వరకు నోటిని తెరవగలుగుతోంది. సర్జరీ విజయవంతం advertisement సీనియర్


ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజీవ్ అహుజా ఆధ్వర్యంలో మొత్తం ఆరుగురు వైద్యుల బృందం బాధితురాలికి ఆపరేషన్ చేసింది. ఆపరేషన్‌కు మూడు వారాల ముందు నుంచి బాధితురాలిని సన్నద్ధం చేశారు. ఇలాంటి రోగులు


నోరు తెరవాలంటే, రెండు కాండైల్స్‌ను (దవడ ఎముకల జాయింట్ల దగ్గర ఉండే గుండ్రని పదార్థం) తొలగించాలి. కొన్నిసార్లు బాల్ జాయింట్ ముందు పెరిగే నాలుక వంటి కండరాన్ని కూడా ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి


ఉంటుంది. లేదంటే దాన్ని ఫ్రాక్చర్ చేయాలి. కానీ బాధితురాలికి కుడి దవడ జాయింట్ దగ్గర కరోనాయిడ్ ప్రాసెస్ చుట్టూ కొన్ని నాళాలు ఉన్నాయి. దీంతో ఆపరేషన్ సులభమైందని డాక్టర్ రాజీవ్ తెలిపారు. మార్చి


20న ఆమెకు సర్జరీ చేశారు. దవడ జాయింట్లు పుర్రెను ఆనుకొని ఉన్న చోట ఎముకను కొంత వరకు కత్తిరించారు. జాయింట్లకు పుర్రె ఎముక అడ్డుపడకుండా చేశారు. దీంతో ఆస్తా ఇప్పుడు నోరు తెరవగలుగుతోంది.


advertisement సమస్యలకు పరిష్కారం సాధారణంగా మనం నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వరకు నోరు తెరవవచ్చు. ఆపరేషన్ తరువాత ఆస్తా ప్రస్తుతం మూడు సెంటీమీటర్ల వరకు నోరు తెరవగలుగుతోంది. ఫిజియో ధెరపీ,


కొన్ని రకాల మౌత్ ఎక్ససైజ్‌లు చేస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమస్య ఆస్తా ఎదుగుదలకు ఎప్పుడూ అడ్డంకిగా మారలేదు. ఆమె ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజరుగా


పనిచేస్తోంది. ఇన్నేళ్ల తరువాత నోరు తెరిచి మాట్లాడుతున్నానని ఆమె చెప్పారు. తనకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన డాక్టర్లకు ఆస్తా కృతజ్ఞతలు తెలిపారు. Location : First Published : March 31, 2021 5:25


PM IST Read More