Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/2025)

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/2025)

Play all audios:


మేషం మధ్యమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం. అశ్విని నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత


మంచిది కాదు (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. భరణి నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. కృత్తిక నక్షత్ర జాతకులకు


మిత్ర తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. వృషభం ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధిచేసే క్రమంలో సఫలీకృతులవుతారు.


తోటివారితో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. కృత్తిక నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. రోహిణి నక్షత్ర జాతకులకు నైదన తార -


చాలా చెడ్డది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. మిథునం ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు.


శ్రీలక్ష్మి సందర్శనం ఉత్తమం. మృగశిర నక్షత్ర జాతకులకు సాధన తార - చాలా మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత నైదన తార - చాలా చెడ్డది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార - అంత మంచిది కాదు


(సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత సాధన తార - చాలా మంచిది. కర్కాటకం ప్రారంభించిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. చంద్ర ధ్యాన శ్లోకం


చదివితే మంచిది. పునర్వసు నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత ప్రత్యక్‌ తార - అంత మంచిది కాదు. పుష్యమి నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది (సాయంత్రం 4 వరకు), ఆ


తర్వాత క్షేమ తార - మంచిది. సింహం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు.


ఇష్టదైవ సందర్శనం ఉత్తమం. మఖ నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. పుబ్బ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ


తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. కన్య మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని  కలిగిస్తుంది.


రెచ్చగొట్టే వారు ఉన్నారు. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత పరమ మిత్ర తార -


మంచిది. హస్త నక్షత్ర జాతకులకు నైదన తార - చాలా చెడ్డది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. తుల దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. స్వల్పప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక


శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. శ్రీమహాలక్ష్మి సందర్శనం శుభప్రదం. చిత్త నక్షత్ర జాతకులకు సాధన తార - చాలా మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. స్వాతి నక్షత్ర


జాతకులకు ప్రత్యక్ తార - అంత మంచిది కాదు (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత సాధన తార - చాలా మంచిది. వృశ్చికం మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు, నిర్ణయం


మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. విశాఖ నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత ప్రత్యక్ తార - అంత మంచిది కాదు. అనురాధ


నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత క్షేమ తార - మంచిది. ధనుస్సు ప్రారంభించిన పని పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనఃశ్శాంతిని తగ్గించే సంఘటనలు చోటుచేసుకుంటాయి.


పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతత కోసం ఈశ్వర సందర్శనం శుభప్రదం. మూల నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు


(సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. మకరం శ్రమకు తగిన ప్రతిఫలం


ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. శ్రీరామ సందర్శనం మరింత మేలు చేస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు


మిత్ర తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. శ్రవణం నక్షత్ర జాతకులకు నైదన తార - చాలా చెడ్డది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. కుంభం అనుకూల సమయం. ఏ


పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు సాధన తార - చాలా మంచిది (సాయంత్రం 4


వరకు), ఆ తర్వాత నైదన తార - చాలా చెడ్డది; శతభిషం నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార - అంత మంచిది కాదు (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత సాధన తార - చాలా మంచిది. మీనం స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం


లాభించినప్పటికీ  కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదేవతా ధ్యాన శుభప్రదం.


పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత ప్రత్యక్ తార - అంత మంచిది కాదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది (సాయంత్రం 4 వరకు), ఆ తర్వాత క్షేమ


తార - మంచిది; రేవతి నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది (సాయంత్రం 4 వరకు). _- ఇంటర్నెట్‌ డెస్క్_