Google ai mode: గూగుల్‌లో కొత్తగా ఏఐ మోడ్‌.. ‘ఫీలింగ్‌ లక్కీ’కి గుడ్‌బై చెప్పేసినట్లేనా?

Google ai mode: గూగుల్‌లో కొత్తగా ఏఐ మోడ్‌.. ‘ఫీలింగ్‌ లక్కీ’కి గుడ్‌బై చెప్పేసినట్లేనా?

Play all audios:


Google AI Mode: గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో కొత్తగా ఏఐ మోడ్‌ రాబోతోంది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఉన్న ‘ఫీలింగ్‌ లక్కీ’ బటన్‌కు గుడ్‌బై చెప్పేసినట్లే అని తెలుస్తోంది. Google AI Mode | ఇంటర్నెట్‌


డెస్క్‌: సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌ కొత్త సదుపాయాన్ని పరీక్షిస్తోంది. తన సెర్చింజన్‌ హోమ్‌పేజీలో ‘ఏఐ మోడ్‌’ను (AI mode) జోడించనుంది. గూగుల్‌ హోమ్‌పేజీలోని వేర్వేరు ప్రదేశాల్లో ఈ బటన్‌


కనిపించినట్లు పలువురు యూజర్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. గూగుల్‌ సెర్చింజన్‌ హోమ్‌పేజీలో గూగుల్‌ సెర్చ్‌తో పాటు ‘ఐయామ్‌ ఫీలింగ్‌ లక్కీ’ (‘I'm Feeling Lucky’) అనే మరో బటన్‌ కూడా


దర్శనమిస్తుంటుంది. ఆ బటన్‌ స్థానంలో ఏఐ మోడ్‌ను పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గూగుల్‌ సెర్చింజిన్‌ ప్రారంభం నుంచి ‘‘I'm Feeling Lucky’’ బటన్‌ గూగుల్‌ అందుబాటులో ఉంది. గూగుల్‌


సెర్చ్‌లో ఏదైనా పదం సెర్చ్‌ చేసి ఈ బటన్‌ క్లిక్‌ చేస్తే వేర్వేరు సెర్చ్‌ రిజల్ట్స్‌ కాకుండా నేరుగా సంబంధిత వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ఉదాహరణకు ‘Eenadu’ అని సెర్చ్‌ చేసి ఈ బటన్‌ క్లిక్‌


చేస్తే నేరుగా ఈనాడు.నెట్‌ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్‌ అవుతారు. మీ సెర్చ్‌ను వేగవంతం చేయడానికి ఈ బటన్‌ను తీసుకొచ్చారు. సెర్చ్‌ బాక్స్‌లో ఏ కీవర్డ్‌ ఎంటర్‌ చేయకుడా ఈ బటన్ క్లిక్‌ చేస్తే గూగుల్


డూడుల్‌ పేజీ ప్రత్యక్షమవుతుంది.  * ప్రైమ్‌ వీడియోలో ఇక యాడ్స్‌.. వద్దనుకుంటే అదనంగా చెల్లించాల్సిందే! చాలా ఏళ్లుగా సెర్చ్‌ ఇంజిన్‌ హోమ్‌పేజీలో భాగంగా ఉన్న ఈ బటన్‌ స్థానంలో ‘ఏఐ మోడ్‌’


చాలామందికి తాజాగా కనిపించినట్లు తెలుస్తోంది. దీన్ని ప్రయోగాత్మకంగా గూగుల్‌ పరీక్షిస్తున్నట్లు అర్థమవుతోంది. అంటే ఇకపై ఏదైనా కీవర్డ్‌ ఎంటర్ చేసి ‘ఏఐ మోడ్‌’ ఎంచుకుంటే సంబంధిత వెబ్‌సైట్‌


కాకుండా ఏఐ సాయంతో సమాధానం ఇవ్వనుందన్నమాట. గూగుల్‌ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్న విషయాన్ని సంస్థ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. అయితే, పూర్తిస్థాయిలో రోల్‌ అవుట్‌ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని


చెప్పారు. త్వరలో దీనిపై మరింత స్పష్టత రానుంది.