
Honda x-adv: మార్కెట్లోకి హోండా మ్యాక్సీ స్కూటర్.. ధర @ 11. 90 లక్షలు
Play all audios:

Honda X-ADV | ఇంటర్నెట్ డెస్క్: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త మ్యాక్సీ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. హోండా ఎక్స్-ఏడీవీ (Honda X-ADV) పేరిట దీన్ని
తీసుకొచ్చింది. దీని ధర రూ.11.90 లక్షలు (ఎక్స్- షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ప్రీమియం రైడర్లను ఆకర్షించేలా కంపెనీ ఈ స్కూటర్‌ను తీసుకొచ్చింది. బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో బుకింగ్‌లు
ఇప్పటికే మొదలయ్యాయని కంపెనీ తెలిపింది. జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. 745సీసీ లిక్విడ్- కూల్డ్ SOHC 8- వాల్యూ పార్లర్- ట్విన్ ఇంజిన్‌తో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు.
6,750 RPM వద్ద 57 hp పవర్‌ని, 4,750 RPM వద్ద 69 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డీఆర్‌ఎల్‌తో వస్తోంది. ముందు భాగంలో 17 అంగుళాల, వెనకవైపు 15 అంగుళాల స్పోక్
వీల్స్ ఇచ్చారు. * యాక్సెంచర్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 15వేల మందికి ప్రమోషన్లు యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, 5 అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. హోండా
రోడ్‌సింక్ యాప్ కనెక్టివిటీ సాయంతో కాల్స్, ఎస్‌ఎమ్మెస్ అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్, వాయిస్ కమాండ్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. రైడ్-బై- రైడ్ టెక్నాలజీ, స్టాండర్ట్,
స్పోర్ట్స్, రెయిన్, గ్రావెల్.. నాలుగు రైడింగ్ మోడ్స్‌తో వస్తోంది. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) సదుపాయం కూడా ఇందులో ఉంది.