
Kia carens clavis: కియా కరెన్స్ క్లావిస్ విడుదల.. ధర రూ. 11. 50 లక్షల నుంచి ప్రారంభం
Play all audios:

Kia Carens Clavis | ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. కరెన్స్ క్లావిస్ (Kia Carens Clavis)ను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.11.50
లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది. అధునాతన ఫీచర్లు, కొత్త హంగులు, మెరుగైన భద్రతా ఫీచర్లను జోడించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల వద్ద మే 9 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
కియా కరెన్స్ క్లావిస్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 113 హెచ్‌పీ పవర్‌ను, 143.8 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్
157 హెచ్‌పీ పవర్‌ను, 253 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 హెచ్‌పీ పవర్‌ను 250 ఎన్‌ఎం టార్క్‌ను ఇస్తుంది. ఎక్స్‌టీరియర్ పరంగా చూస్తే కియా కరెన్స్ క్లావిస్
పూర్తి కొత్త డిజైన్‌తో వస్తోంది. ముందువైపు పాడ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, వీ షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, బ్లాక్డ్ ఆఫ్ గ్రిల్‌తో డిజైన్ చేశారు. పనోరమిక్ సన్‌రూఫ్, స్పోర్టీ 17 అంగుళాల అల్లాయ్
వీల్స్‌తో మరింత ఆకట్టుకునే లుక్‌తో దీన్ని తీసుకొచ్చారు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ రూఫ్ రెయిల్స్‌తో వస్తోంది. వెనకభాగంలో కరెన్స్‌ను ఫాలో అయినప్పటికీ.. ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్‌కు
ఫ్రెష్ లుక్ ఇచ్చారు. * జొమాటోలో మరో బాదుడు.. దూరాన్ని బట్టి ఇక డెలివరీ ఛార్జీ! ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. క్లావిస్‌లో సెల్టోస్ తరహాలో 22.62 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంది.
10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 10.25 అంగుళాల టచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉన్నాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రీడిజైన్డ్ ఏసీ వెంట్స్, ఆటో కంట్రోల్స్, ఫోర్-వే
పవర్ అడ్జస్టబుల్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. కరెన్స్ క్లావిస్‌లో 20కి పైగా భద్రతాపరమైన లెవెల్-2 అడాస్ ఫీచర్లు
ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఫ్రంట్, రేర్ పార్కింగ్ సెన్సర్లు, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్,
బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్ వంటి అధునాతన ఫీచర్లను క్లావిస్‌కు జోడించారు. మొత్తం 7 ట్రిమ్స్‌లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.11.50 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.18 లక్షల వరకు ఉంది.