China: చైనా కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

China: చైనా కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు ప్రావిన్సు షాన్‌డాంగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారిక మీడియా వెల్లడించింది. వెంటనే రంగంలోని దిగిన


రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రాణనష్ట వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆ ప్రాంతంలో వందల అడుగుల ఎత్తులో దట్టమైన పొగ వ్యాపించినట్టు సమాచారం. భారీ ప్రమాదం..? ఈ పేలుడు


దాటికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు పగిలినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటన నేపథ్యంలో 232 మంది అగ్నిమాపక సిబ్బందితోపాటు రక్షణ చర్యల్లో భాగంగా వైద్య నిపుణులు, పలు ప్రత్యేక బృందాలను


అక్కడికి పంపించినట్లు ఎమర్జెన్సీ మేనేజిమెంట్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీఫాంగ్‌ నగరంలోని ఇండస్ట్రియల్‌ పార్కులో ఉన్న షాన్‌డాంగ్‌ యుడావో రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకున్న


తెలుస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 500 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.