Maruti suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులు

Maruti suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులు

Play all audios:


Maruti Suzuki | దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ లెవల్‌ మోడళ్లలోనూ ఇకపై ఆరు ఎయిర్‌బ్యాగులు అందించాలని నిర్ణయించింది. ఆల్టో కే10,


వ్యాగనార్‌, సెలిరియో, ఈకో మోడళ్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగులు అందించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వాహనదారుల భద్రతే తమకు ముఖ్యమని వెల్లడించింది. దేశంలో రహదారుల మౌలిక సదుపాయాలు


వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) పార్థో బెనర్జీ అన్నారు. హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలు అందుబాటులోకి వస్తున్నాయని


తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కూడా కీలకమని అభిప్రాయపడ్డారు. వ్యాగనార్‌, ఆల్టో కే10, సెలిరియో, ఈకో వంటి మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగులు అందించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన భద్రత


లభిస్తుందన్నారు. ఈ మోడళ్లను అరెనా సేల్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా మారుతీ విక్రయిస్తుండగా.. గ్రాండ్‌ విటారా, ఇన్విక్టో వంటి మోడళ్లను తన నెక్సా ఔట్‌లెట్లలో విక్రయిస్తోంది.