
6 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్‌తో గెలాక్సీ f56.. ధర, ఫీచర్లు ఇవీ..
Play all audios:

Samsung Galaxy F56 5G: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్56ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించింది. Samsung Galaxy F56 5G | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ మరో
కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా లాంచ్ చేసింది. ఎఫ్ సిరీస్‌లో ఎఫ్56 5జీ (Samsung Galaxy F56 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆరేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ
అప్‌డేట్స్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఎఫ్ సిరీస్ ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఫోన్‌లలో ఇదే అతి తక్కువ మందం కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంది. గెలాక్సీ ఎఫ్56 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల
ఫుల్‌హెచ్‌డీ సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేతో వస్తోంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120 Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. విజన్ బూస్టర్ టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తోంది. ముందూ వెనుక కార్నింగ్
గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ కోటింగ్‌తో వస్తోంది. ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 ఎంపీ ప్రధాన కెమెరాతో
పాటు మరో రెండు కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 12 ఎంపీ హెచ్‌డీఆర్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అబ్జెక్ట్ ఎరేజర్, ఎడిట్ సజెషన్స్ వంటి ఏఐ ఇమేజింగ్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక వైపు కెమెరాతో 4k
వీడియోలను రికార్డ్ చేయొచ్చు. 2X జూమ్ వరకు జూమ్ చేయొచ్చు. ఈ ఫోన్ మందం 7.2 ఎంఎం ఉంది. * ADAS లెవల్ 2 ఫీచర్లతో కియా కరెన్స్ క్లావిస్.. రేపటి నుంచి బుకింగ్స్ షురూ ఈ ఫోన్‌లో 5000
ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం నాక్స్ వాల్ట్ ఫీచర్ ఉంది. శాంసంగ్ వాలెట్ సదుపాయం ఉంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.25,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధరను రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. గ్రీన్, వయలెట్ రంగుల్లో లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో కలుపుకొని ప్రారంభ ధరలను
నిర్ణయించింది. నేటి నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.