Vijay: సూర్యుడికి కులం, మతం ఉందా..? విద్యార్థులకు హీరో విజయ్‌ ప్రశ్న

Vijay: సూర్యుడికి కులం, మతం ఉందా..? విద్యార్థులకు హీరో విజయ్‌ ప్రశ్న

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ హీరో విజయ్ (Vijay) విద్యార్థులకు సూచించారు. వాటి ఆధారంగా విభజనను


తోసిపుచ్చాలని కోరారు. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన అనంతరం ఆయన పలు సూచనలు చేశారు. ఈ ప్రకృతికి మతం, కులం ఉన్నాయా..? అని ప్రశ్నించారు. తమిళనాడు రాజధాని


చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ..‘‘ ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది. ప్రజాస్వామిక విలువలను పాటించాలని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. అవినీతి కార్యకలాపాలకు


దూరంగా ఉండే.. విశ్వసనీయత కలిగిన వ్యక్తులకు ఓటు వేయాలని కోరండి. కులం, మతం ఆధారంగా విభజనను తోసిపుచ్చండి. అలాంటి అంశాలతో మీ మనసు పాడుచేసుకోకండి. సూర్యుడు, వరణుడు.. వంటి వాటితో నెలవైన ప్రకృతికి


ఆ భేదం ఉందా..? డ్రగ్స్‌ను దూరం పెట్టినట్టే కులం, మతం వంటి వాటినీ దరిచేరనీయొద్దు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే.. ఈ ప్రపంచంలో స్వేచ్ఛ ఉంటుంది’’ అని సూచించారు. విజయ్‌ పలు అంశాలపై తన అభిప్రాయాలను


సూటిగా చెప్తుంటారన్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే..  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Polls) వచ్చే ఏడాది జరగనున్నాయి. టీవీకేతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు


చేస్తున్నాయి. రాష్ట్రంలో విజయ్‌ అధికార డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భాజపాపైనా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.