Fact check: ఆ కాన్వాయ్‌పై దాడి వీడియో నిజం కాదు: కేంద్రం క్లారిటీ

Fact check: ఆ కాన్వాయ్‌పై దాడి వీడియో నిజం కాదు: కేంద్రం క్లారిటీ

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: మన జవాన్లపై దాడి జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అవుతున్న నకిలీ వీడియోపై కేంద్రం స్పందించింది. జమ్మూకశ్మీర్‌లో సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు విధులు ముగించుకొని


తిరిగి వస్తుండగా కాన్వాయ్‌పై కొందరు రాళ్ల దాడి చేసినట్లుగా సర్క్యులేట్‌ అవుతోన్న వీడియోను నమ్మొద్దని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ (PIB factcheck) విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు


పెట్టింది. * జ్యోతి మల్హోత్రా గ్యాడ్జెట్లలో 12టెరా బైట్ల డేటా..! ‘‘ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. షేర్‌ అవుతున్న వీడియో పాతది. అది కూడా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోనిది.


అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వీడియోను షేర్‌ చేయొద్దు అని సూచించింది. నకిలీ వార్తలను ఎదుర్కొనేందుకు జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఏవైనా అనుమానిత వీడియోలు


కనిపిస్తే పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ వాట్సప్‌ నంబర్‌ 8799711259, E-mail: [email protected]కు పంపాలని కోరింది.