Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధానిమోదీ

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధానిమోదీ

Play all audios:


దిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్‌


మెరుపుదాడుల నేపథ్యంలో పాక్‌ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత


ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్‌


డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో .. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌


(Security Advisor Ajit Doval) మాట్లాడారు. మరో వైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడులకు స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. భార్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలన్నారు.


బుధవారం ఉదయం ప్రధాని అధ్యక్షతన సీసీఎస్‌ సమావేశం జరగనున్నట్టు సమాచారం.