
Operation sindoor: భారత సరిహద్దుల్లో మళ్లీ పాక్ డ్రోన్లు..?
Play all audios:

కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాక్ దాడులు చేస్తూనే ఉందా? అవుననే అంటున్నాయి డిఫెన్స్ వర్గాలు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాక్ దాడులు చేస్తూనే ఉందా? అవుననే అంటున్నాయి డిఫెన్స్ వర్గాలు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో డ్రోన్లు కనిపించినట్లు కథనాలు
వస్తున్నాయి. అయితే, ఎలాంటి అలారమ్‌లు మోగలేదని తెలుస్తోంది. సాంబాలో పాక్ డ్రోన్లు దూసుకొచ్చినట్లు వీడియోను ఓ న్యూస్ ఏజెన్సీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. పెద్ద శబ్దాలు కూడా
వచ్చినట్లు.. భారత్ కూడా దాడులను తిప్పికొట్టినట్లు పేర్కొంది. పంజాబ్‌లోని జలంధర్‌లోనూ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో డ్రోన్లు కనిపించాయని డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. భారత ఆర్మీ
సమర్థవంతంగా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. నిపుణులు డ్రోన్ల శకలాల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. ఇండిగో విమాన సేవలు.. ఈ ప్రాంతాలకు రాకపోకలు రద్దు భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు కాస్త
సద్దుమణిగినట్లు అనిపించడంతో విమాన సేవలను పునరుద్ధరించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. అయితే, ఇండిగో ఎయిర్‌వేస్ మాత్రం తమ సేవలను మంగళవారం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు
ఇండిగో సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. ‘‘ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో ప్రయాణికుల భద్రతే మాకు తొలి ప్రాధాన్యం. జమ్మూ, అమృత్ సర్, చండీగఢ్, లెహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌కు
మే 13న (మంగళవారం) రాకపోకలను రద్దు చేస్తున్నాం. ఇప్పటికే ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నవారి ఇబ్బందిని అర్థం చేసుకోగలం. అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. మా బృందాలు నిరంతరం పరిస్థితులను
పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఇస్తాం. మీరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేముందు విమానం స్టేటస్‌ను మా వెబ్‌సైట్, యాప్‌లో చెక్ చేసుకోగలరు. మీకు ఎలాంటి అవసరం ఉన్నా కేవలం మెసేజ్
లేదా కాల్ దూరంలోనే ఉంటాం. సాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం’ అని పోస్టు చేసింది.