Aparadhi review: రివ్యూ: అపరాధి.. ఫహాద్‌ ఫాజిల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

Aparadhi review: రివ్యూ: అపరాధి.. ఫహాద్‌ ఫాజిల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

Play all audios:


ఓటీటీలో సినిమాలు ఒకేసారి అన్ని భాషల్లో విడుదల కావడం సాధారణం. కొన్ని చిత్రాలు ముందుగా ఓ ఓటీటీలో మాతృ భాషలో రిలీజై, తర్వాత మరో ఓటీటీలో వేరే భాషలో స్ట్రీమింగ్‌ కావడం అరుదు. ఈ రెండో జాబితాలోని


చిత్రమే ‘ఇరుళ్‌’ (Irul). నేరుగా ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. ‘ఆహా’ (Aha)లో గురువారం నుంచి తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), సౌబిన్‌


షాహిర్‌ (Soubin Shahir), దర్శనా రాజేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే? (Aparadhi Review) హంతకుడెవరు? వ్యాపారవేత్త అయిన అలెక్స్‌ (సౌబిన్‌ షాహిర్‌) అప్పుడప్పుడు నవలలు


రాస్తుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి అర్చన పిళ్లై (దర్శనా రాజేంద్రన్‌)తో కలిసి ఓ వారాంతంలో విహారయాత్ర ప్లాన్‌ చేస్తాడు. అలా ఆ ఇద్దరు షికారు చేస్తుండగా మార్గమధ్యలో కారు బ్రేక్‌డౌన్‌ అవుతుంది.


మరోవైపు, భారీ వర్షం. దీంతో, సమీపంలోని ఓ ఇంటికి వెళతారు. ఉన్ని (ఫహాద్‌ ఫాజిల్‌) వారికి ఆశ్రయం ఇస్తాడు. ఓ నవలలో తాను రాసినట్టే ఆ ఇంట్లో చోటుచేసుకునే ఘటనలు చూసి షాక్‌ అవుతాడు అలెక్స్‌. అదే


సమయంలో అలెక్స్‌ గురించి అర్చనకు కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ ఇంట్లో ఓ మృతదేహాన్నీ గుర్తిస్తుంది.  ఇల్లు ఉన్నిది కాదని అర్థమవుతుంది. మరి, అర్చనకు తెలిసిన విషయాలేంటి? ఆ మర్డర్‌ చేసింది ఉన్నినా?


అలెక్సా? తదితర ఆసక్తికర సన్నివేశాల సమాహారం ‘అపరాధి’ చిత్రం (Aparadhi Story). మూడు పాత్రలే.. ఈ సినిమా ద్వారా నిజానికి, అబద్ధానికి తేడా ఏంటన్న దాన్ని తమదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు రచయిత


సునీల్‌ యాదవ్‌, దర్శకుడు నసీఫ్‌ యూసఫ్‌ ఇజుద్దీన్‌. ఉన్ని, అలెక్స్‌లో మంచోడు ఎవరో అర్చన తెలుసుకోవడం ఈ చిత్రంలోని కీలకాంశం. అలెక్స్‌, అర్చనల పరిచయంతో ముందుగా ఈ సినిమా లవ్‌స్టోరీని


తలపిస్తుంది. కథ ‘ఇంటికి’ చేరాక సస్పెన్స్‌క్రియేట్‌ అయింది. అయితే, ఒకే లొకేషన్‌ (ఇల్లు).. మూడు పాత్రలే ప్రధానంగా కథను నడిపించడం సవాలు. ఈ విషయంలో దర్శకుడు ఓ మేరకు మెప్పించగలిగారు. ఆ ప్రేమికుల


వివరాలు ఉన్ని, ఆయన వివరాలు ప్రేమజంట తెలుసుకునే సీక్వెన్స్‌ బోరింగ్‌గా ఉంటుంది. తర్వాత ఎదురయ్యే కొన్ని ట్విస్టులే ఈ సినిమాకి బలం (Aparadhi Review in Telugu). * ‘ఆపరేషన్‌ సిందూర్‌’ టైటిల్‌..


15 నిర్మాణ సంస్థల పోటీ! ఇంట్లో డెడ్‌బాడీ కనిపించే సన్నివేశం నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఉన్నిని హంతకుడు అన్నట్టు అలెక్స్‌ మాట్లాడడం, నవలలోనే కాదు బయటా హత్యలు చేసేది అలెక్సే అంటూ ఉన్ని


వాదించడం.. ఇలా వారిద్దరిలో సైకో కిల్లర్‌ ఎవరో కనిపెట్టడం అటు అర్చన పనే కాదు.. ఆడియన్స్‌ది కూడా. ప్రేక్షకుడి ఊహకు భిన్నంగా క్లైమాక్స్‌ ఉంటుంది (Irul Review in Telugu). నటనపరంగా ఫహాద్‌,


సౌబిన్‌, దర్శన అదరగొట్టారు. ఉన్నిగా ఫహాద్ విభిన్న కోణాల్లో కనిపిస్తారు. * కుటుంబంతో కలిసి చూడొచ్చా?: నిరభ్యంతరంగా చూడొచ్చు. ఎక్కడా అసభ్యతకు తావులేదు. నిడివి కూడా తక్కువే (గంటన్నర). *


చివరిగా: ‘అపరాధి’.. థ్రిల్‌ కొంచమే (Aparadhi Review)!