
Devara: ‘చుట్టమల్లె’.. ఆ విషయంలో నిరాశకు గురయ్యా: కొరియోగ్రాఫర్
Play all audios:

‘దేవర’(Devara)లోని రొమాంటిక్ సాంగ్ ‘చుట్టమల్లె’ (Chuttamalle)కు కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు బోస్కో మార్టిస్ (Bosco). ఆ పాటకు సంబంధించి టీమ్ నుంచి తనకు సరైన గుర్తింపు రాలేదని తాజాగా ఆయన
వెల్లడించారు. ముంబయి: ‘దేవర’(Devara)లోని రొమాంటిక్ సాంగ్ ‘చుట్టమల్లె’ (Chuttamalle)కు కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు బోస్కో మార్టిస్ (Bosco). ఎన్టీఆర్ (NTR) - జాన్వీకపూర్ (Janhvi
Kapoor)పై చిత్రీకరించిన ఈ పాట అంతటా విశేష ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పాటకు సంబంధించి టీమ్ నుంచి తనకు సరైన గుర్తింపురాలేదని తాజాగా బోస్కో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రమోషన్స్ సమయంలో తన గురించి పెద్దగా మాట్లాడకపోవడం తననెంతో బాధించిందన్నారు. ‘‘ప్రమోషన్స్ సమయంలో జాన్వీకపూర్ అయినా మాట్లాడుతుందని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు’’ అని ఆయన తెలిపారు.
అనంతరం ఆయన విక్కీ కౌశల్ (Vicky kaushal)ను ఉద్దేశించి మాట్లాడారు. ‘బ్యాడ్ న్యూస్’లో ఎంతో పాపులరైన ‘తౌబా తౌబా’ పాటకు తానే కొరియోగ్రఫీ చేశానని చెప్పారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో విక్కీ తన
గురించి గొప్పగా చెప్పారన్నారు. ఏదైనా పాటలు పాపులర్ అయినప్పుడు కొరియోగ్రాఫర్‌కు సరైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలో ఇది కొరవడిందని వెల్లడించారు. *
రాజమౌళి కాదు.. ఆమిర్ టీమ్ సంప్రదించింది.. బయోపిక్‌పై స్పష్టత ఎన్టీఆర్ - జాన్వీకపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా ఇది సిద్ధమైంది.
ఎన్నో అంచనాల మధ్య గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇందులో ఎన్టీఆర్ దేవర - వర అనే రెండు పాత్రల్లో కనిపించారు. తంగం పాత్రలో జాన్వీకపూర్ సందడి చేశారు. ఎన్టీఆర్
- జాన్వీపై చిత్రీకరించిన ‘చుట్టమల్లె’ పాటకు అనిరుధ్ స్వరాలు అందించగా.. శిల్పారావు ఆలపించారు. యూట్యూబ్‌లో ‘చుట్టమల్లె’ వీడియో సాంగ్‌కు 126 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ చిత్రానికి కొనసాగింపుగా
‘దేవర 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. కొరియోగ్రాఫర్‌గా ఎంతో పేరు సొంతం చేసుకున్నారు బోస్కో. బాలీవుడ్‌లో చాలా చిత్రాల కోసం ఆయన వర్క్ చేశారు. ‘జూమ్ జో పఠాన్’, ‘కాలా చష్మా’ వంటి పాటలకు ఆయన
కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.