
Ram charan: రామ్‌చరణ్‌తో కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్: ఫొటోలు వైరల్
Play all audios:

కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్ జూలియస్, రామ్‌చరణ్ మీట్ అయ్యారు. సంబంధిత ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ హీరో రామ్‌చరణ్ (Ram Charan) లండన్
పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ (Julius Francis)ఆయన్ను మంగళవారం కలిశారు. బాక్సింగ్ బెల్ట్‌ను తన భుజంపై వేయమని చరణ్‌ను జూలియస్ కోరారు. సంబంధిత ఫొటోలు
నెట్టింట వైరల్‌గా మారాయి. బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా 5 సార్లు, కామన్వెల్త్ ఛాంపియన్‌గా 4 సార్లు సత్తా చాటారు జూలియస్. * కష్టం ఎదురైన ప్రతిసారీ ఒంటరిగా కూర్చోండి: పూరి జగన్నాథ్
లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన తన మైనపు విగ్రహావిష్కరణకు రామ్‌చరణ్ లండన్ వెళ్లారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఆ వేడుకలో ఆయనతోపాటు కుటుంబం పాల్గొంది. చరణ్ మైనపు
విగ్రహంలో ఆయనతో పాటు తన పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండటం విశేషం. ఇలా పెంపుడు జంతువుతో కలిసి ఉన్న మైనపు విగ్రహం కలిగిన రెండో సెలబ్రిటీ (తొలి వ్యక్తి రాణి ఎలిజబెత్ 2) రామ్ చరణ్.