
Ms dhoni: అరుదైన రికార్డ్‌కు ఒక అడుగు దూరంలో ఎంఎస్ ధోని
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోని (MS Dhoni) మరో మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 403 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధోని.. 349 సిక్స్‌లు కొట్టాడు. మరో సిక్సర్ బాదితే 350 సిక్స్‌లు కొట్టిన
బ్యాటర్ల క్లబ్‌లో చేరతాడు. ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా ఈ రోజు రాత్రి దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్
(Rajasthan Royals) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనే ధోని అరుదైన ఈ రికార్డును సాధిస్తాడని అభిమానులు ఆశతో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో చేరిన 34వ బ్యాటర్‌గా, రోహిత్ శర్మ (Rohit
Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తర్వాత నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు. క్రిస్ గేల్ (Chris Gayle) 463 మ్యాచ్‌ల్లో 1,056 సిక్స్‌లతో మొదటి
స్థానంలో కొనసాగుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. కానీ తర్వాత మ్యాచుల్లో ఓడిపోతూ వచ్చింది. 12 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే
సాధించింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో పది నుంచి ఎనిమిదో
స్థానానికి చేరుకుంటుంది. రాజస్థాన్ రాయల్స్ చివరి స్థానానికి పడిపోతుంది. వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌నకు చేరుకోకపోవడం చెన్నైకి ఇదే ప్రథమం. ఈ సీజన్‌లో ధోని కూడా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా
ఎత్తుపల్లాలను చవిచూశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగాక ధోని సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. తాను ఆడిన 12 మ్యాచుల్లో 180 పరుగులు చేశాడు. గత నెలలో ఒక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్
అవార్డునూ గెలుచుకున్నాడు.