Junior davis cup: భారత్‌ చేతిలో ఓడి.. పాక్‌ ఆటగాడి అహంకార ప్రవర్తన

Junior davis cup: భారత్‌ చేతిలో ఓడి.. పాక్‌ ఆటగాడి అహంకార ప్రవర్తన

Play all audios:


జూనియర్‌ డేవిస్‌ కప్‌ టోర్నమెంట్‌ సందర్భంగా భారత ప్లేయర్‌తో ఓ పాక్‌ ఆటగాడు అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: జూనియర్‌ డేవిస్‌ కప్‌లో అండర్‌16


టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్‌ ఓడించిన విషయం తెలిసిందే. కజకిస్థాన్‌లో జరుగుతున్న ఈ టెన్నిస్‌ పోటీల్లో.. సూపర్‌ టై-బ్రేక్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లలో భారత క్రీడాకారులు


ప్రకాశ్‌ శరణ్‌, తన్విష్‌ పహ్వాలు విజయం సాధించారు. ఇందులో ఓ మ్యాచ్‌ తర్వాత పాక్‌ ఆటగాడు అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆటగాడు భారత ఆటగాడితో


షేక్‌హ్యాండ్‌ ఇచ్చే క్రమంలో అమర్యాదగా ప్రవర్తించినట్లు కనిపించింది. ఓటమి తర్వాత తీవ్ర నిరాశకు గురైన అతడు.. భారత ఆటగాడితో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. చివరకు చేయి కలిపినా.. నిర్లక్ష్యంగా


చేతితో కొడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. అహంకారంగా ప్రవర్తించిన ప్రత్యర్థి తీరు నచ్చనప్పటికీ.. భారత ప్లేయర్‌ మాత్రం హుందాగా ప్రవర్తించడం విశేషం.