
Congress: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు
Play all audios:

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గాంధీభవన్‌లో బైఠాయించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు
(పాత చిత్రం) హైదరాబాద్: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీ
భవన్‌లోనే ధర్నా చేసినందుకు చర్యలు తీసుకున్నారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. (Congress) అసలేం జరిగిందంటే.. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్
చేస్తూ ఇటీవల సునీతారావు ఆధ్వర్యంలో మహిళా నేతలు గాంధీభవన్‌లోని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళా కాంగ్రెస్ తీవ్రంగా
శ్రమించిందని.. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల విషయంలో మహిళా కాంగ్రెస్‌కు అన్యాయం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు
మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎన్నిసార్లు కలిసినా ముఖ్యమంత్రిని కలవండి అని చెబుతున్నారని తెలిపారు. (Telangana News)