Abha: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ బెనిఫిట్స్ ఇవే.. మెడికల్ రికార్డులపై ఇక నో టెన్షన్

Abha: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ బెనిఫిట్స్ ఇవే.. మెడికల్ రికార్డులపై ఇక నో టెన్షన్

Play all audios:


Published by: Last Updated:June 20, 2024 4:30 PM IST కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ హెల్త్‌ లాకర్‌ ఫెసిలిటీ ప్రారంభించింది. దీన్ని యాక్సెస్‌ చేసేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)ను


ప్రవేశపెట్టింది. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని హాస్పిటల్‌కు వెళ్తే, బోలెడు టెస్టులు చేసి రిపోర్టులు చేతిలో పెడతారు. డాక్టర్ కన్సలింగ్‌కు ఎప్పుడు వెళ్లినా పాత రిపోర్టులు అన్నీ


తీసుకెళ్లాలి. ప్రిస్క్రిప్షన్స్, రిపోర్టులు, బిల్లులు.. ఇలా ఓ ఫోల్డర్ మెయింటెన్‌ చేయాల్సి వస్తుంది. ఏ ఒక్క డాక్యుమెంట్‌ మిస్ అయినా వ్యాధి నిర్ధారణ, చికిత్స, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌పై ప్రభావం


పడుతుంది.ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో కూడా ఇలాంటి ఫిజికల్ రికార్డులు మోసుకెళ్లడం ఇబ్బందికరమైన విషయం. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ హెల్త్‌ లాకర్‌ ఫెసిలిటీ


ప్రారంభించింది. దీన్ని యాక్సెస్‌ చేసేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)ను ప్రవేశపెట్టింది. దీని ప్రయోజనాలు చూద్దాం.ABHA (హెల్త్ ఐడీ) సంఖ్య అంటే ఏంటి?ABHA నంబర్ అనేది 14 అంకెలు ఉండే


స్పెషల్ నంబర్. భారతీయ పౌరులు ఎవరైనా ఉచితంగా ABHA నంబర్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి ఒక ABHA నంబర్‌ మాత్రమే ఉంటుంది. ఇది మీ హెల్త్‌ రికార్డులను డిజిటల్‌ లాకర్‌ నుంచి యాక్సెస్


చేయడానికి, లింక్ చేయడానికి, షేర్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నంబర్‌ను సులభంగా గుర్తుంచుకోవడానికి ఒక ABHA ఐడీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అడ్రస్‌ మీ ABHA నంబర్‌కి లింక్ అయి ఉంటుంది. అవసరమైతే


మల్టిపుల్ అడ్రస్‌లు క్రియేట్‌ చేసుకోవచ్చు. అయితే ABHA ఐడీ క్రియేట్ చేయడం తప్పనిసరి కాదు.బెనిఫిట్స్ ఇవేప్రస్తుతం ప్రతి హాస్పిటల్ మీ హెల్త్ రికార్డుల కోసం సొంత ఐడీ క్రియేట్‌ చేస్తుంది. ఒకవేళ


మీరు కొత్త హాస్పిటల్‌కు వెళ్లే, పాత ట్రీట్‌మెంట్ డాక్యుమెంట్స్‌ అన్నింటినీ తీసుకెళ్లాలి. కానీ ABHA ఐడీతో మీ మెడికల్ హిస్టరీని ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు. మీరు కేవలం వైద్యులకు మీ స్పెషల్


నంబర్ చెప్తే సరిపోతుంది, ఫిజికల్‌ డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ABHA మొబైల్ యాప్ ద్వారా మీ మెడికల్ రికార్డులను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. ప్రస్తుత డిజిటల్


ప్రపంచంలో కూడా ఇలాంటి ఫిజికల్ రికార్డులు మోసుకెళ్లడం ఇబ్బందికరమైన విషయం. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ హెల్త్‌ లాకర్‌ ఫెసిలిటీ ప్రారంభించింది. దీన్ని యాక్సెస్‌


చేసేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)ను ప్రవేశపెట్టింది. దీని ప్రయోజనాలు చూద్దాం. ABHA (హెల్త్ ఐడీ) సంఖ్య అంటే ఏంటి? ABHA నంబర్ అనేది 14 అంకెలు ఉండే స్పెషల్ నంబర్. భారతీయ పౌరులు


ఎవరైనా ఉచితంగా ABHA నంబర్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి ఒక ABHA నంబర్‌ మాత్రమే ఉంటుంది. ఇది మీ హెల్త్‌ రికార్డులను డిజిటల్‌ లాకర్‌ నుంచి యాక్సెస్ చేయడానికి, లింక్ చేయడానికి, షేర్‌


చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నంబర్‌ను సులభంగా గుర్తుంచుకోవడానికి ఒక ABHA ఐడీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అడ్రస్‌ మీ ABHA నంబర్‌కి లింక్ అయి ఉంటుంది. అవసరమైతే మల్టిపుల్ అడ్రస్‌లు క్రియేట్‌


చేసుకోవచ్చు. అయితే ABHA ఐడీ క్రియేట్ చేయడం తప్పనిసరి కాదు. advertisement బెనిఫిట్స్ ఇవే ప్రస్తుతం ప్రతి హాస్పిటల్ మీ హెల్త్ రికార్డుల కోసం సొంత ఐడీ క్రియేట్‌ చేస్తుంది. ఒకవేళ మీరు కొత్త


హాస్పిటల్‌కు వెళ్లే, పాత ట్రీట్‌మెంట్ డాక్యుమెంట్స్‌ అన్నింటినీ తీసుకెళ్లాలి. కానీ ABHA ఐడీతో మీ మెడికల్ హిస్టరీని ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు. మీరు కేవలం వైద్యులకు మీ స్పెషల్ నంబర్ చెప్తే


సరిపోతుంది, ఫిజికల్‌ డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ABHA మొబైల్ యాప్ ద్వారా మీ మెడికల్ రికార్డులను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. advertisement ABHA నంబర్ మీ


అన్ని వైద్య రికార్డులకు డిజిటల్ రిపాజిటరీగా పనిచేస్తుంది. ప్రిస్క్రిప్షన్స్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీల వరకు అన్నింటినీ దీంట్లో స్టోర్ చేయవచ్చు. ఇది ఫిజికల్‌ డాక్యుమెంట్స్ అవసరాన్ని


తగ్గిస్తుంది. ఇది ఇంటర్‌ఆపరేబుల్ సర్వీస్. అంటే వివిధ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌తో పని చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా రికార్డులను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ABHA నంబర్ ఎలా క్రియేట్


చేయాలి? ఇందురు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ABHA పోర్టల్ (abha.abdm.gov.in) విజిట్‌ చేసి, ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ ఫాలో అయి క్రియేట్‌ చేసుకోవచ్చు. ABHA యాప్ లేదా Aarogya Setu వంటి ఏదైనా ABDM


పార్ట్‌నర్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకొని సెల్ఫ్‌-రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ఆరోగ్య సేవలను అందించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ABHA నంబర్‌ క్రియేట్‌ చేయవచ్చు. అవసరమైతే


ఆసుపత్రులు, కస్టమర్ సేవా కేంద్రాలు లేదా ఇన్సూరెన్స్‌ కంపెనీల సహాయం తీసుకోవచ్చు. advertisement డేటా సేఫ్టీ మాట ఏంటి? హెల్త్‌ రికార్డులను షేర్‌ చేయడంపై ప్రజలకు నియంత్రణ ఉంటుంది. మీరు


డాక్టర్‌కి యాక్సెస్‌ ఇచ్చినప్పుడు, ఏ రిపోర్టులు చూడాలి అనేది ఎంచుకోవచ్చు. మీ ప్రైవసీని కాపాడుకునే ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మీ మెడికల్ డేటా మీ అనుమతితో మాత్రమే షేర్ అవుతుంది.


హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అండ్‌ కన్సెంట్‌ మేనేజర్ (HIE-CM), మెడికల్‌ రికార్డులను, సంబంధిత వ్యక్తుల అనుమతితో మాత్రమే షేర్‌ అయ్యేలా చూస్తుంది. ప్రభుత్వం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మీ


హెల్త్ రికార్డులను నిల్వ చేయవు. అవి సేఫ్‌ డేటా ఎక్స్ఛేంజ్‌ ఆప్షన్లు మాత్రమే అందిస్తాయి. Location : Hyderabad,Telangana First Published : June 20, 2024 4:29 PM IST Read More