
Russia: ఉగ్రవాదంపై పోరు.. సహకారంపై రష్యా పూర్తి హామీ - భారత్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు తమ మద్దతు ఉంటుందని రష్యా (Russia) మరోసారి స్పష్టం చేసింది. మునుపటి ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపింది. ఈ
క్రమంలో సంప్రదింపుల ప్రక్రియలో ఉన్న మిలిటరీ ఆర్డర్లను వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. ‘‘భిన్న రూపాల్లో ఉన్న ఉగ్రవాదంపై పోరాడుతున్న మనకు పూర్తి మద్దతు ఇస్తామని రష్యా హామీ
ఇచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది’’ అని రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ పేర్కొన్నారు. మాస్కో పర్యటన ముగించుకొని భారత్‌కు బయలుదేరిన ఆయన అక్కడ
మీడియాతో మాట్లాడారు. * భారత్‌తో ఉద్రిక్తతల వేళ.. పాక్ నెత్తిన ‘బలోచ్’ కుంపటి మాస్కోలో నిర్వహించిన విక్టరీ డే (Victory Day) పరేడ్‌లో భారత్ తరఫున రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్
పాల్గొన్నారు. అనంతరం రష్యా రక్షణశాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. గతంలో రూపొందించుకున్న నిబంధనలు, వరుస సంప్రదింపుల ద్వారా సంబంధాలను మరింత బలోపేతం
చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. సీమాంతర ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించడంపై రష్యాకు భారత్ ధన్యవాదాలు తెలిపింది.