Badar khan suri: ఆ భారతీయ విద్యార్థిని విడుదల చేయండి: అమెరికా న్యాయస్థానం

Badar khan suri: ఆ భారతీయ విద్యార్థిని విడుదల చేయండి: అమెరికా న్యాయస్థానం

Play all audios:


బదర్‌ఖాన్‌ను తక్షణమే విడుదల చేసి, వర్జీనియా వెళ్లేందుకు అనుమతించాలని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది.  వాషింగ్టన్‌: హమాస్‌ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో భారత విద్యార్థి


బదర్‌ఖాన్‌ సురి అమెరికాలో అరెస్టయిన (Indian Student Arrested) సంగతి తెలిసిందే. ఈక్రమంలో సురికి అమెరికా న్యాయస్థానంలో ఊరట లభించింది. నిర్బంధంలో ఉన్న భారతీయ విద్యార్థిని తక్షణమే విడుదల చేయాలని


ఆదేశాలు ఇచ్చింది. టెక్సాస్‌ నుంచి వర్జీనియా వెళ్లేందుకు అనుమతించాలని డిస్ట్రిక్ట్ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయమూర్తి మాటలు విన్నప్పుడు తనకు కన్నీళ్లు వచ్చాయని సురి భార్య సంతోషం


వ్యక్తంచేశారు. వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టోరల్‌గా ఉన్న బదర్‌ ఖాన్‌ సురి (Badar Khan Suri).. విశ్వవిద్యాలయంలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని


డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అధికారులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. దీంతో అతడి వీసాను రద్దు


చేయడమే గాక.. వర్జీనియాలోని నివాసం నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన అరెస్టును సవాల్‌ చేస్తూ సురి కోర్టును ఆశ్రయించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రపూరిత చర్యేనని తన పిటిషన్‌లో


ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వర్జీనియా కోర్టు.. అతడికి ఇటీవల తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఈ వ్యవహారంపై న్యాయస్థానం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు


అతడిని అమెరికా నుంచి పంపించకూడదని స్పష్టంచేసింది. అప్పటినుంచి అతడిని లూసియానాలోని ఇమిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచినట్లు అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియస్‌ వెల్లడించింది. ఇప్పుడు


అక్కడినుంచి విడుదల చేస్తూ కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.