
Sunday stories | latest sunday stories - eenadu
Play all audios:

నిర్ణయం ‘‘చిన్నీ, నాన్న ఇంటికి వచ్చేశారే. బాగానే ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. సెలవు చూసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసి రా’’ సుగుణ పిన్ని ఫోన్‌లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను.
‘‘నిజంగానా? ఏదీ ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను’’ ఆతృతగా అడిగాను. ‘‘ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. బాగా అలిసిపోయారే, లేచాక చేయిస్తాలే’’ అని ఫోన్ పెట్టేసింది.