Ramgopalpet fire accident: 10 గంటల పాటు తగలబడటానికి కారణం అదేనా? ఆ భవనం లోపల ఏమున్నాయి?

Ramgopalpet fire accident: 10 గంటల పాటు తగలబడటానికి కారణం అదేనా? ఆ భవనం లోపల ఏమున్నాయి?

Play all audios:


Published by: Last Updated:January 19, 2023 10:10 PM IST RAMGOPALPET FIRE ACCIDENT: డెక్కన్ నైట్ వేర్ షాప్‌లో టీ షర్ట్స్ ప్రింటింగ్ కోసం వాడే కెమికల్స్‌ను పెద్ద మొత్తంలో నిల్వ చేయడంతో... ఆ


రసాయన వల్లే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని అధికారులు అనుమానిస్తున్నారు సికింద్రాబాద్ నడిబొడ్డున జరిగిన భారీ అగ్నిప్రమాదం (Secunderabad Fire Accident).. హైదరాబాద్ (Hyderabad) నగరవాసులను


తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. డెక్కన్ నైట్‌వేర్ స్టోర్ ఉన్న ఆరంతస్తుల భవనంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు..  చుట్టు పక్కల ప్రజలకు ఊపిరాడకుండా చేశాయి. సాధారణంగా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే..


అగ్నిమాపక సిబ్బంది ఒకటి రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొస్తారు. కానీ గురువారం ఉదయం రాంగోపాల్ పేటలో జరిగిన అగ్నిప్రమాదం (Ramgopalpet Fire Accident) మాత్రం..చాలా తీవ్ర స్థాయిలో


జరిగింది. మంటలను అదుపు చేసేందుకు దాదాపు పది గంటల సమయం పట్టింది. ఆ భవనంలో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయిన తర్వాతే.. మంటలు అదుపులోకి వచ్చాయి. ఏకధాటిగా 10 గంటల పాటు తగలబడడమంతో.. భవనం మొత్తం


ధ్వంసమైంది. అందులో ఉన్న ప్రతి వస్తువూ కాలిబూడిదయింది. ఆ భవనం ఎప్పుడైనా కుప్పకూలవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ స్థాయిలో మంటలు చెలరేగడానికి కారణమేంటనే దానిపై రకరకాల అభిప్రాయాలు


వినిపిస్తున్నాయి. భవనంలోని గ్రౌండ్‌లో కార్ డేకర్ షాప్ ఉంది. ఆపై అంతస్తులో బట్టల దుకాణం ఉంది. ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు వ్యాపించాయి. అవి క్రమంగా పై అంతస్తులకు


విస్తరించి... భవనం మొత్తం కాలిపోయింది.  డెక్కన్ నైట్ వేర్ షాప్‌లోని దుస్తులన్నీ తగలబడ్డాయి. లోపలి నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి


చేరుకొని.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. లోపల చిక్కున్న పలువురిని కాపాడి..బయటకు తీసుకొచ్చారు. ఐతే లోపల పలువురు చిక్కుకున్నారని.. వారు మరణించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.


advertisement ఐతే డెక్కన్ నైట్ వేర్ షాప్‌లో టీ షర్ట్స్ ప్రింటింగ్ కోసం వాడే కెమికల్స్‌ను పెద్ద మొత్తంలో నిల్వ చేయడంతో... ఆ రసాయన వల్లే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని అధికారులు


అనుమానిస్తున్నారు. ఆ కెమికల్స్ వల్ల.. మంటలను త్వరగా అదుపు చేయడం సాధ్యం కాలేదని చెబుతున్నారు. దాదాపు 20 ఫైర్ ఇంజిన్లు నిరంతరాయంగా మంటలను అదుపుచేసే ప్రయత్నం చేసినా..ఆరిపోలేదు. అదే సమయంలో


గాలులు బాగా వీయడంతో.. మంటలు మరింత ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పక్కన ఉన్న భవనాలను కూడా వ్యాపించడంతో.. బస్తీ ప్రజలు భయంతో వణికిపోయారు. అధికారులు అప్రమత్తమై ముందుజాగ్రత్తగా అక్కడి నుంచి ఖాళీ


చేయించారు. advertisement ఎట్టకేలకు 10 గంటలు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఐతే భవనంలో చిక్కుకొని ఎవరైనా మరణించారా? అనే దానిపై స్పష్టత లేదు. లోపలికి వెళ్లేందుకు సిబ్బంది కూడా


భయపడుతున్నారు. ఎందుకంటే.. సుదీర్ఘ సమయం పాటు భవనం కాలిపోవడంతో.. అది ఎప్పుడైనా కూలిపోయే అవకాశముంది. అందవల్ల లోపలికి ఎవరీన వెళ్లనీయడం లేదు. ఈ ఘటనపై శుక్రవారం మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.


Location : Hyderabad,Hyderabad,Telangana Secunderabad,Hyderabad,Telangana First Published : January 19, 2023 10:05 PM IST Read More