Defence stocks: భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు.. డిఫెన్స్‌ స్టాక్స్‌ పరుగులు

Defence stocks: భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు.. డిఫెన్స్‌ స్టాక్స్‌ పరుగులు

Play all audios:


Defence stocks | ముంబయి: ఉగ్రవాదులను ఏరిపారేయడమే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను జీర్ణించుకోలేని పాకిస్థాన్‌ దుస్సాహసానికి ఒడిగడుతోంది. రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తోంది.


జమ్మూ విమానాశ్రయంతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని గురువారం దాడులకు యత్నించింది. ఈ ప్రయత్నాలను భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్‌ జెట్లను


కూల్చేసింది. ఈక్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో డిఫెన్స్‌ సంబంధిత స్టాక్స్‌ రాణిస్తున్నాయి. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ 9.73


శాతం, పరాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ 5.89 శాతం, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ 4.88 శాతం, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ 3.63 శాతం,


హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ 3.60 శాతం చొప్పున బీఎస్‌ఈలో రాణిస్తున్నాయి. డ్రోన్ల తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఏకంగా 18 శాతం మేర లాభాల్లో కొనసాగుతోంది. డ్రోనాచార్య


ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ లిమిటెడ్‌ 4.99 శాతం లాభాల్లో కొనసాగుతోంది. *  Operation Sindoor LIVE updates: ఆపరేషన్‌ సిందూర్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ మరోవైపు మన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో


కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 800 పాయింట్లు, నిఫ్టీ 250కి పైగా పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌,


పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ పైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా.. టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ షేర్లు మాత్రమే లాభాల్లో


కొనసాగుతున్నాయి.