Us-china: అమెరికా-చైనా మధ్య కుదిరిన ట్రేడ్‌ డీల్‌..

Us-china: అమెరికా-చైనా మధ్య కుదిరిన ట్రేడ్‌ డీల్‌..

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా-చైనా (US-China) మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది.


వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ట్రేడ్‌ డీల్‌ (Trade Deal)కు ఇరుదేశాలు సుముఖత చూపించినట్లు సమాచారం. చైనాతో చర్చల్లో గణనీయమైన పురోగతి కన్పించిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్


బెసెంట్ తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. వాణిజ్య యుద్ధ (Trade War) ఆందోళనల వేళ ఇరుదేశాల మధ్య


స్విట్జర్లాండ్‌ వేదికగా రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. స్కాట్‌ బెసెంట్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్‌ గ్రీర్‌.. చైనా ప్రతినిధులతో సమావేశమయ్యారు. దీనిపై బెసెంట్‌ మాట్లాడుతూ.. చర్చలు


ఫలప్రదంగా జరిగాయని తెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇరుదేశాలు పరస్పరం విధించుకున్న టారిఫ్‌లు భారీ స్థాయిలోనే ఉన్నాయని, వాటిని


తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, సుంకాల తగ్గింపునకు అంగీకరించారా లేదా? అన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. అనంతరం గ్రీర్‌ స్పందిస్తూ.. ఇరుదేశాల మధ్య 1.2 ట్రిలియన్‌ డాలర్ల


వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ఇరువైపులా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. * బ్రిటన్‌ వైన్‌పై సుంకాల కోత లేదు గుడ్‌ మీటింగ్‌: ట్రంప్‌ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా దీనిపై ట్రూత్‌


వేదికగా పోస్ట్‌ చేశారు. ‘‘చైనాతో మంచి భేటీ జరిగింది. చాలా విషయాలు చర్చకు వచ్చాయి. కొన్నింటిపై ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. రెండు దేశాలకు ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవాలనే మేం


కోరుకుంటున్నాం. మంచి పురోగతి లభించింది’’ అని ఆయన రాసుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత నెలలో చైనాపై సుంకాలను 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా చైనా కూడా


అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలు విధించింది. ఇలా అధిక టారిఫ్‌లు విధించుకోవడం అంటే ఈ దేశాలు ఒకదానికొకటి ఉత్పత్తులను బహిష్కరించుకోవడం కిందే లెక్క. గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం 660


బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. తాజా చర్చల ప్రారంభానికి ముందే, చైనాపై అమెరికా సుంకాలు తగ్గించవచ్చని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 80 శాతం సుంకాల విధింపు సరైనదిగా


భావిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉండగా.. భారత్‌ సహా ఇతర దేశాలతోనూ త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు కెవిన్‌ హాసెత్‌ వెల్లడించారు.