Sumanth: రోబోలా ఎందుకుంటావ్‌? అనేవారు: సుమంత్‌

Sumanth: రోబోలా ఎందుకుంటావ్‌? అనేవారు: సుమంత్‌

Play all audios:


‘కాకమ్మ కథలు’ (Kaakamma Kathalu) టాక్‌ షోలో నటులు సుమంత్‌ (Sumanth), శ్రీనివాస్‌ అవసరాల (Srinivas Avasarala) అతిథులుగా పాల్గొన్నారు. ఇంటర్నెట్ డెస్క్‌: ‘కాకమ్మ కథలు’ (Kaakamma Kathalu) టాక్‌


షోలో నటులు సుమంత్‌ (Sumanth), శ్రీనివాస్‌ అవసరాల (Srinivas Avasarala) అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఏంటీ? దేనికి రియాక్ట్‌ అవ్వరు?’ అని అమ్మాయిలు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా’’ అని వ్యాఖ్యాత


అడగ్గా సుమంత్‌ స్పందించారు. ‘ఏదోటి చెప్పు.. రోబోలా ఎందుకుంటావ్‌?’ అని అనేవారని నవ్వులు పూయించారు. వెంకటేశ్‌తో డ్యాన్స్‌ చేస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ తాను నటుడు కాకపోయి ఉంటే


మేనేజరుగా పని చేసేవాడినని అన్నారు. ప్రస్తుతం తాను సింగిలేనని తెలిపారు. * ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ: ‘పెండులమ్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? పున్నమి వెన్నెల్లో, గోదావరి, చక్కని చుక్కు,


ఏమో గుర్రం ఎగరావచ్చు.. వీటిని ఉపయోగించి ఓ వాక్యం చెప్పే ఛాలెంజ్‌ను సుమంత్‌ స్వీకరించారు. ‘‘పున్నమి వెన్నెల్లో ఒక చక్కని చుక్క నా వద్దకు వచ్చి గోదావరి పార్ట్‌ 2 చేయొచ్చు కదా అని అడిగింది. ఏమో


గుర్రం ఎగరావచ్చు అని చెప్పా’’ అంటూ సుమంత్‌ సందడి చేశారు. సుమంత్‌ ‘గోదావరి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాను అప్పట్లో తరచూ ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’కు ఫోన్‌ చేసేవాడినని, ఎవరూ లిఫ్ట్‌


చేసేవారు కాదని శ్రీనివాస్‌ గుర్తుచేసుకుంటూ నవ్వులు పూయించారు. పూర్తి ఎపిసోడ్‌ ఓటీటీ ‘ఆహా’ (Aha)లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ప్రోమో విడుదలైంది.