Adnan sami: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. పాక్‌పై సింగర్‌ అద్నాన్‌ సమీ మీమ్స్‌

Adnan sami: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. పాక్‌పై సింగర్‌ అద్నాన్‌ సమీ మీమ్స్‌

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పాక్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రముఖుల నుంచి


సామాన్యుల వరకు సోషల్‌ మీడియా వేదికగా భారత సైన్యాన్ని, ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. పాకిస్థాన్‌కు తగిన న్యాయం జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ (Adnan Sami)


మీమ్స్‌ రూపంలో తాజా పరిణామాలపై స్పందించారు. భారత పౌరసత్వం పొందిన ఈ గాయకుడి పోస్టులపై నెట్టింట అందరి దృష్టి నెలకొంది. * ‘సిందూర్‌’.. తిలకం మాత్రమే కాదు.. మా సంకల్పానికి ప్రతీక ‘ఆపరేషన్‌


సిందూర్‌.. జైహింద్‌’ అంటూ బుధవారం ఉదయం పోస్టు పెట్టిన ఆయన తర్వాత మీమ్స్‌ వేశారు. ‘ప్రస్తుతం.. పాకిస్థానీ టీవీ న్యూస్‌ యాంకర్స్‌ పరిస్థితి ఇదీ’ అంటూ తుపాకీ గురిపెట్టి ఉన్న వ్యక్తుల ఫొటోలు


పంచుకున్నారు. మాక్‌డ్రిల్‌ గురించి భారతీయులు మాట్లాడుకుంటుండగా.. పాక్‌ రహస్యంగా వింటోందని తెలియజేసేలా మరో ఫొటో షేర్‌ చేశారు. ‘సిందూర్‌ సే తందూర్‌ తక్‌’ పేరుతో ఓ పోస్టర్‌ పంచుకున్నారు.